రష్మిక చెల్లి ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మేజర్ మిస్సింగ్ అంటూ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా పేరు సొంతం చేసుకుంది.

ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో ఈ అమ్మడు రేంజ్ హై లో ఉంది.తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.

ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.

Advertisement

ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఇటీవలే పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.

Advertisement

కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ విషయాలను తెగ షేర్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ.

ఇక తాజాగా తన చిట్టి చెల్లెలు షిమాన్ మందన ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.ఇక ఆ ఫోటోకు మేజర్ మిస్సింగ్ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది.

అందులో తన చెల్లి కూడా కాస్త పెద్దదిగా మారినట్లు కనిపించింది.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇప్పటికే తన చెల్లి తో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో బాగా పంచుకుంది.ఇక ఈ పోస్ట్ ని చూసిన నెటిజనులు.

మీ చెల్లి చాలా పెద్దది అయ్యింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం రష్మిక పలు సినిమాల్లో బిజీగా ఉంది.

అందులో బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ఇక టాలీవుడ్ లో కూడా ఇటీవలే ఓ సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.