ఈ హిట్ సినిమాల్లో ఈ సెలబ్రిటీస్ కూడా నటించారా.. కనిపించలేదే..?

సాధారణంగా సినిమాల్లో సక్సెస్ కాక ముందు సెలబ్రిటీస్ వివిధ రకాల పనిచేస్తారు.దర్శకులు అయితే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తారు.

కొంతమంది చిన్న చిన్న పాత్రలు కూడా వేస్తుంటారు.డైరెక్టర్లు ఒక్కళ్లే కాదు మ్యూజిక్ డైరెక్టర్లు ఇతర క్రూ సిబ్బంది కూడా అనుకోకుండా మూవీ రోల్స్ చేసి ఆశ్చర్యపరుస్తుంటారు.

అయితే గుర్తింపు రాకముందు వీళ్లు సినిమాల్లో చేస్తారు కాబట్టి వారిపై మనం పెద్దగా ఫోకస్ పెట్టలేము.చిన్న పాత్రలు కాబట్టి వారిని గుర్తించలేము.

కొన్ని హిట్ సినిమాల్లో కూడా ఈ సెలబ్రిటీస్ నటించారు.కానీ చాలామందికి వాటి గురించి తెలియదు.

Advertisement

ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

• శంకర్ దాదా ఎంబీబీఎస్

2004లో విడుదలైన కామెడీ డ్రామా శంకర్ దాదా ఎంబీబీఎస్( Shankar Dada MBBS ) వంద రోజులు ఆడే బ్లాక్ బస్టర్ హిట్‌ అయినా సంగతి తెలిసిందే.ఇందులో చిరంజీవి తన యాక్టింగ్ తో ఇరగదీసేశాడు.జయంత్ సి.పరంజీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సోనాలి బింద్రే, శ్రీకాంత్, గిరీష్ కర్నాడ్, పరేష్ రావా వంటి యాక్టర్స్ కీలక పాత్ర పోషించారు.ఇందులో శర్వానంద్( Sharwanand ) కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించాడు.

అంజలా జవేరి ఒక పాటలో స్పెషల్ గా కనిపించింది.నా పేరే కాంచనమాల పాటలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా కనిపిస్తాడు.

అయితే వీరందరితో పాటు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఇందులో కనిపించాడు.అతడు తన చెయ్యి ఫ్రాక్చర్ అయిన పేషెంట్ లాగా కనిపించి వెళ్తాడు.

యాబైవేల మందితో రైతు ఉద్యమానికి సిద్ధమవుతున్న కేటీఆర్ ? 
బిగ్ బాస్ 8 నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మ తిరిగి పోవాల్సిందే?

కానీ చాలామంది అతడు ఈ సినిమాలో నటించాడనేది గుర్తించలేరు.అంత ఫాస్ట్ గా అతడి ఫ్రేమ్ వెళ్ళిపోతుంది.

Advertisement

చిరంజీవి శ్రీకాంత్ తో కలిసి డీఎస్పీ కనిపిస్తాడు.అది ఒక హాస్పటల్ లాగా ఉంటుంది.

• సందీప్ రెడ్డి వంగా

అర్జున్ రెడ్డి( Arjun Reddy ) డైరెక్టర్ సందీప్ రెడ్డి( Sandeep Reddy ) కెరీర్ తొలినాళ్లలో కేడి సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశాడు.అంతేకాదు ఈ సినిమాలో సిగరెట్ తాగే ఒక కుర్రాడి వేషంలో కనిపించాడు.అయితే సినిమా పర్టిక్యులర్ గా చూస్తేనే అతడిని మనం కనిపెట్టగలం.

• ప్రభాస్

యమదొంగ( Yamadonga ) సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) రెండు మూడు సెకన్ల పాటు విశ్వామిత్రుడి వేషంలో కనిపించాడు.టైటిల్స్ పడేటప్పుడు అతను కనిపిస్తాడు.ఆ వేషంలో ఉండటం వల్ల ఎవరు ఈ హీరోని గుర్తించలేదు.

• నాగ్ అశ్విన్

లీడర్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేయడమే కాకుండా అందులో ఒక చిన్న రోల్ చేశాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్.( Nag Ashwin ) కానీ చాలా చిన్న రోల్ కాబట్టి ఈ సంగతిని ఎవరూ గుర్తించలేదు.

తాజా వార్తలు