బంగాళ‌దుంప‌తో ఈ ఆహారాలు క‌లిపి తిన‌కూడ‌ద‌ని మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా విసృతంగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బంగాళ‌దుంప ( Potato )ఒక‌టి.పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌లు కూడా బంగాళ‌దుంప‌ను ఇష్టంగా తింటుంటారు.

బంగాళ‌దుంప‌తో క‌ర్రీలే కాకుండా స్నాక్స్ మ‌రియు ర‌క‌ర‌కాల రెసిపీస్ త‌యారు చేస్తుంటారు.అధికంగా కార్బోహైడ్రేట్లు ఉన్న‌ప్ప‌టికీ.

మితంగా తీసుకుంటే బంగాళ‌దుంప బోలెడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.అయితే బంగాళదుంపతో కొన్ని ఆహారాలు కలిపి తినడం ఆరోగ్యానికి హానిక‌రం.

ఈ జాబితాలో పాల పదార్థాల గురించి మొద‌టిగా చెప్పుకోవాలి.బంగాళ‌దుంప‌తో పాలు, పెరుగు, చీజ్, వెన్న ( Milk, yogurt, cheese, butter )వంటి ప‌దార్థాలు క‌లిపి లేదా వెంట వెంట‌నే తీసుకోకూడ‌దు.ఎందుకంటే, బంగాళదుంపలోని కార్బోహైడ్రేట్స్, పాలలోని ప్రోటీన్లు కలిస్తే జీర్ణ సమస్యలకు దారి తీయ‌వ‌చ్చు.

Advertisement

అలాగే కొంద‌రు బంగాళదుంప, మాంసాహారం క‌లిపి వండుతుంటాయి.అయితే ఈ రెండూ కలిపి తింటే జీర్ణవ్యవస్థ మీద అధిక భారం పడుతుంది, ఫలితంగా అజీర్ణం, గ్యాస్, కడుపులో నెప్పి వంటి స‌మ‌స్య‌లు ఏర్పడవచ్చు.

బంగాళదుంప మ‌రియు టమోటా కూడా బ్యాడ్ ఫుడ్ కాంబినేష‌న్.టమోటాలో( tomato ) ఆమ్లతత్వం అధికంగా ఉంటుంది, బంగాళదుంప కాబోహైడ్రేట్స్ ను ఎక్కువగా కలిగి ఉంటుంది.

అందువ‌ల్ల ఈ రెండింటిని క‌లిపి తింటే కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు త‌లెత్త‌వ‌చ్చు.

బంగాళదుంప, గుడ్డు క‌లిపి వండుకుని తింటుంటారు.ఇవి రెండు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలే అయినా, వీటిని కలిపి తినడం మంచి కాదు.బంగాళదుంప మ‌రియు గుడ్డు కలిపి తినడం వల్ల హానికరమైన టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోవచ్చు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

ఇది కాలేయ పనితీరును దెబ్బతీడ‌యంతో పాటు మలబద్ధకం, వికారం, అలసటను కలిగించే ప్రమాదం కూడా ఉంది.పైగా బంగాళదుంప మ‌రియు గుడ్డు రెండూ కేలరీలు ఎక్కువగా కలిగి ఉన్న ఆహార పదార్థాలు.

Advertisement

వీటిని ఒకేసారి లేదా క‌లిపి తింటే వెయిట్ గెయిన్ అవుతారు.ఇక బంగాళ‌దుంప, ఉల‌వ‌లను కూడా క‌లిపి తీసుకోరాదు.

ఉలవలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, బంగాళదుంప చల్లని స్వభావం కలిగి ఉంటుంది.అందువ‌ల్ల ఇవి కలిపి లేదా ఒకేసారి తింటే శరీరంలో అసమతుల్యత ఏర్పడి.

అలసట, వికారం లాంటి సమస్యలు రావచ్చు.

తాజా వార్తలు