మామిడి పండ్లను తినే ముందు ఖ‌చ్చితంగా ఇలా చేయాల‌ని మీకు తెలుసా?

ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ సీజ‌న్.అంటే మామిడి పండ్ల సీజ‌న్‌.ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడి పండ్లు దొర‌క‌వు.

కేవ‌లం స‌మ్మ‌ర్‌లోనే ఇవి విరి విరిగా ల‌భ్య‌మ‌వుతుంటాయి.వేస‌వి కాలం ప్రారంభం నుంచీ ఎక్క‌డ చూసినా మామిడి పండ్లే క‌నువిందు చేస్తుంటాయి.

పిల్ల‌లైనా, పెద్ద‌లైనా నోరూరించే తియ్య తియ్య‌టి మామిడి పండ్ల‌ను చూస్తే తిన‌కుండా ఉండ‌లేరు.పైగా వీటిలో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ ఇ, కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, ఫోలేట్‌, బీటా కెరాటిన్ తో పాటు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ సైతం స‌మృద్ధిగా నిండి ఉంటాయి.

అందుకే మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ, అంద‌రూ గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం ఏంటంటే.మామిడి పండ్ల‌ను తినే ముందు ఖ‌చ్చితంగా వాట‌ర్‌లో క‌నీసం అర గంట పాటు నాన‌బెట్టుకోవాలి.

Advertisement

ఎందుకంటే మామిడి పండ్లు త్వ‌ర‌గా పాడ‌వ‌కుండా ఉండేందుకు మ‌రియు పండ‌టానికి ప‌లు ర‌సాయ‌నాల‌ను వాడ‌తారు.అవి మ‌న ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.

మామిడి పండ్ల‌ను శుభ్ర‌మైన నీటిలో అర గంట నుంచి గంట పాటు నాన‌బెట్టుకుంటే.ఆయా ర‌సాయ‌నాలు తొల‌గిపోతాయి.

మామిడి పండులో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్‌ ఉంటుంది.ఇది మంచిదే కానీ శ‌రీరంలోకి ఎక్కువ మోతాదులో వెళ్తే.

ఐరన్‌, జింక్, కాల్షియం, మెగ్నీషియం మ‌రియు ఇతర ఖనిజాలను గ్రహించే శ‌క్తి త‌గ్గిపోతుంది.పైగా ఫైటిక్ యాసిడ్‌కి శ‌రీరంలో వేడిని పెంచే గుణం ఉంది.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

అందువ‌ల్లే మామిడి పండ్లను నీటిలో కొంత స‌మ‌యం పాటు నాన‌బెట్టుకుని.ఆపై తినాలి.

Advertisement

ఇలా చేస్తే వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ త‌గ్గుతుంది.అంతేకాదు, వాట‌ర్‌లో కాసేపు నాన‌బెట్టిన‌ మామిడి పండ్లను తిన‌డం వ‌ల్ల వెయిట్ లాస్ అవుతారు.

మలబద్ధకం, కడుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ అద్భుతంగా బ‌ల‌ప‌డుతుంది.

మ‌రియు ఎముక‌లు, దంతాలు దృఢంగా కూడా మార‌తాయి.

తాజా వార్తలు