ఈ టెస్లా కారుతో నీళ్లలో కూడా ఎంచక్కా బోటు షికారు చేయొచ్చు తెలుసా? 

ఈ వర్షాకాలంలో దేశంలో చాలా ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం మనం చూసాం.

అదే నీళ్లపై బోట్‌లా వెళ్లే కార్లు అయితే ఆ ప్రమాదం నుండి తప్పించుకునేయే కదా.

అవును, మీరు విన్నది నిజమే.వాటర్ పైన నడిచే కార్లు రాబోతోఉన్నాయి.

ఇకపోతే వాటర్‌ బోట్‌ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.ఈ క్రమంలో త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

సైబర్‌ట్రక్‌ మాడల్‌ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.ఈ కారు వాటర్‌ ప్రూఫ్‌గా ఉండబోతోంది.

Advertisement

నీళ్లపై కాసేపు బోట్‌లా పనిచేస్తుందని తాజాగా వెల్లడించారు.సైబర్‌ట్రక్‌ మాడల్‌ కారును నదులు, సరస్సులు, సముద్రాలు దాటేలా డిజైన్‌ చేస్తున్నామని తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అయితే, 2019లోనే సైబర్‌ట్రక్‌ డిజైన్‌ను విడుదల చేసింది టెస్లా సంస్థ.కానీ, అది ఇప్పటి వరకు మార్కెట్‌లోకి రాలేదు.

కానీ, వచ్చే ఏడాదిలో ఈ డిజైన్‌ కార్లను ఉత్పత్తి చేసేలా టెస్లా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ కారు బాడీని రాకెట్లలో ఉపయోగించే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేయనున్నారు.

స్పోర్ట్స్‌ కారు కంటే ఎక్కువ సామర్థ్యంతో ఈ కార్లు పనిచేస్తాయని చెబుతున్నారు.సైబర్‌ట్రక్ మోడల్‌ పడవలా ఉపయోగపడేంత వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది, కనుక ఇది నదులు, సరస్సులు సముద్రాలను కూడా దాటగలదు అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు టెస్లా CEO.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

సైబర్‌ట్రక్ నీటిలో దాదాపు 360 మీటర్లు అంటే 1,100 అడుగులు ప్రయాణించగలదని తెలుస్తోంది.అయితే, టెస్లా వాహనాలను పడవగా ఉపయోగించగలగడం గురించి మస్క్ మాట్లాడటం ఇది మొదటిసారి కాదు.కొన్ని సంవత్సరాల క్రితం, ఒక టెస్లా మోడల్ S ఒక వరదలో ఉన్న సొరంగం ద్వారా డ్రైవింగ్ చేయడం లాంటివి పంచుకున్నారు.

Advertisement

తర్వాత మోడల్ Sని దాదాపు పడవగా ఉపయోగించవచ్చని సీఈవో చెప్పారు.ఇక, 2020లో, ప్రజలు సైబర్‌ట్రక్‌ను పడవగా మార్చగలరని అనే ప్రచారం కూడా జరిగింది.కానీ ఇప్పుడు, సైబర్‌ట్రక్ అండర్‌క్యారేజ్ “తగినంత వాటర్‌ప్రూఫ్”తో నీటిపై తేలుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది.

తాజా వార్తలు