ఈ సింపుల్ టెక్నిక్ తో ప్లాస్టిక్ బ్యాగ్లను సబ్బుగా మర్చవచ్చాని మీకు తెలుసా..!

భూమిపై అతి ప్రధాన సమస్య ప్లాస్టిక్ పొల్యూషన్( Plastic pollution )యూజ్ అండ్ థ్రో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ చాలా విపరీతంగా ఉపయోగించడం వల్ల భూమిపై కాలుష్యం రోజురోజుకు పెరుగుతూ పోతోంది.

ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ప్లాస్టిక్ ను ఉపయోగించడం తగ్గించాలని, వీటి ప్రభావం కాలుష్యం రూపంలో ఎలా ఉంటుందో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

అయితే శాస్త్రవేత్తలు( Scientists ) ప్లాస్టిక్ లో ఉండే పాలిథిలిన్ ను మరింత ఉపయోగకరంగా మార్చవచ్చని అంటున్నారు.ప్లాస్టిక్ ను సబ్బుగా మార్చడం ద్వారా దానికి న్యూ లైఫ్ ఇచ్చే మెథడ్ ను కనుగొన్నారు.

ప్లాస్టిక్స్ రసాయనికంగా ఫ్యాటీ యాసిడ్స్ ను పోలి ఉంటుందని తెలిసిందే.ఇది సబ్బులోని ప్రధాన పదార్థాలలో ఒకటి.

సబ్బుల తయారీకి ఉపయోగించే కీలక అణువులుగా మార్చవచ్చని వర్జీనియా టెక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Advertisement

బాటిల్స్, బ్యాగ్స్, ఫుడ్ ప్యాకేజింగ్ లో ఉపయోగించే ప్లాస్టిక్ లో పాలిథిలిన్, పాలీప్రోఫైలిన్( Polypropylene ) ను డిటర్జెంట్ కు ఇంగ్రెడియంట్స్ గా వినియోగిస్తారు.ఈ పాలిథిలిన్ ఒక పొడవాటి కార్బన్ గొలుసులతో తయారు చేయబడింది.వివిధ రకాల డిటర్జెంట్, సబ్బులలో ఓ పదార్థమైన సర్ఫ్యాక్టేంట్ లను తయారు చేయడానికి ఉపయోగించే ఫ్యాటీ యాసిడ్స్ కు సమానమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.

కాబట్టి పాలిథిలిన్( Polyethylene ) చెయిన్ ను చిన్న భాగాలుగా విభజించి గొలుసు చివర యాసిడ్ గ్రూప్స్ ను జోడించడం వల్ల ఫ్యాటీ యాసిడ్ ను తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ముందుగా శాస్త్రవేత్తలు దిగువన వేడిగా, పై భాగంలో చల్లగా ఉండే ఓవెన్ ని ఉపయోగించడం వల్ల పాలిథిలిన్ ను గ్యాస్ గా మార్చకుండా చిన్నచిన్న ముక్కలుగా విడగొట్టేందుకు ప్రయత్నించారు.చివరకు వ్యాక్స్ మాదిరిగా ఉండే షార్ట్-చైన్ పాలిథిలిన్ ప్రోడక్ట్ ఏర్పడింది.

ఈ చిన్న మైనపు గొలుసుల చివర ఆక్సిజన్ అణువులను జోడించి, వాటి కొవ్వును ఆమ్లాలుగా మార్చారు.ఇక చివరలో సపోనిఫికేషన్ అని విలువ బడే రసాయన ప్రతిచర్య ద్వారా ఈ ఫ్యాటీ యాసిడ్స్ ను సబ్బుగా మార్చేశారు.

ఆవాల‌తో మొటిమ‌లకు సులువుగా చెక్ పెట్టేయండిలా!
Advertisement

తాజా వార్తలు