ఇప్పుడు అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటిస్తున్న ఓజి.
ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ కనిపిస్తాడని తెలియడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.సాహో తరువాత సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది.ఇక సుజిత్( Sujith ) పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో పవన్ కళ్యాణ్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడని అందరు ఎదురుచూస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి జోడిగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ ఫేస్ ని చూపిస్తూ పోస్టర్స్ ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.
అయితే ఒక పోస్టర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గన్ పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.అయితే ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ చేతిపై ఉన్న టాటూపై( tattoo ) అందరి కళ్ళు పడ్డాయి.
అసలు ఆ టాటూకి అర్థం ఏంటి అని అందరు సెర్చ్ చేయడం మొదలెట్టారు.
పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇప్పుడు భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఓజి.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ఈ మూవీ గ్లింప్స్ లేదా టీజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఈ టీజర్ కట్ 70 సెకండ్లు ఉంటుందని సమాచారం.
ఈ టీజర్ కి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ యాడ్ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే తాజగా ఈ సినిమా టీం ఫస్ట్ లుక్ లేదు అంటూ ఆకలితో ఉన్న చిరుత కోసం వెయిట్ చేద్దాం అని ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పోస్టర్ లో గన్ పట్టుకున్న పవన్ చేతి పై ఒక టాటూ కనిపిస్తోంది.ఇక ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా.అసలు ఆ టాటూ అర్ధం ఏమిటా అని నెటిజెన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
అయితే తాజాగా ఈ టాటూకు అర్ధం ఫైర్ పవర్ అని ఒక ట్విట్టర్ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే ఆ టాటూకి అర్థం ఏమిటో త్వరలో రిలీజ్ అయ్యే వీడియోల్లో తెలియనుంది.
సెప్టెంబర్ 2 కోసం ఫ్యాన్స్, సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy