తంగలాన్ సినిమా కోసం విక్రమ్ అంత కష్టపడ్డాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్(Vikram ) కి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది.

ఆయన సినిమాలు అక్కడ హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా మంచి ఇమేజ్ ను అందుకుంటాయి.

ఆయన సినిమాలు తెలుగులో కూడా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా మంచి పేరునైతే సంపాదించుకుంటాయి.ఇక ప్రతి సినిమాలో ఆయన క్యారెక్టర్ కోసం ఇప్పటిదాకా కష్టపడుతూ ఉంటాడు.

కానీ ఆయన కష్టానికి తగ్గిన ప్రతిఫలం అయితే దక్కడం లేదు.ఇక మొత్తానికైతే ఇప్పుడు తంగలాన్ సినిమాతో( Thangalaan ) మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సినిమాతో ఆయన చాలా అవార్డులు కూడా అందుకుంటాడు అంటూ చాలా రోజుల నుంచి దర్శకనిర్మాతలు చాలా అంచనాలైతే పెట్టుకున్నారు.

మరి దానికి అనుగుణంగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు.ఇక ట్రైలర్ అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉండడం ఒక వంతుకు ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.

Advertisement

అయితే ఈ సినిమాలో ఇంతవరకు తను ఎప్పుడు పోషించనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో నటించాడు.

ఇక ఈ క్యారెక్టర్ మేకప్ కోసం ఆయన దాదాపు ఐదు నుంచి ఆరు గంటల వరకు కష్టపడేవాడట.ఇంకా మేకప్ సెట్టింగ్ గాని, ఆ హెయిర్ డిజైనింగ్ గానీ అంతా పర్ఫెక్ట్ గా ఉండడం కోసం ఆయన విపరీతంగా కష్టపదేవాడని కూడా సినిమా యూనిట్ అంతా ఆయన డెడికేషన్ కి మెచ్చుకుంటున్నారు.నిజానికి విక్రమ్ తప్ప ఆ పాత్రకి ఎవరు న్యాయం చేయలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.ఇక ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు