త్రివిక్రమ్ గుంటూరు కారం విషయం లో ఎలాగైతే చేశాడో దేవర విషయం లో కొరటాల అలానే చేశాడా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.అందులో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి.

మరి ఎందుకు ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయనే విషయంలోనే చాలా రకాల మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి.అయితే జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )చేసిన దేవర సినిమా మీద ప్రస్తుతానికి మిక్సెడ్ టాక్ ఐతే వస్తుంది.

మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుంది అనేది తెలీదు గానీ మొత్తానికైతే దేవర సినిమా ఎన్టీఆర్ కెరియర్ కి ఏ రకంగా యూజ్ అవుతుంది అనే విషయంలోనే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.

ముఖ్యంగా గుంటూరు కారం సినిమా( Guntur Kaaram)లో రొటీన్ రొట్ట కథను తీసుకొని ఆ సినిమాని సక్సెస్ చేయాలని చూశాడు.ఇక ఈ సినిమాలో కూడా అలాంటి మిస్టేకే జరిగిందని చాలామంది సినీ విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే దేవర సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి భారీ సక్సెస్ అందివ్వకపోయినా కూడా పర్ఫామెన్స్ పరంగా ఆయనలోని నటుడిని పూర్తి స్థాయిలో బయటికి తీసుకు వచ్చిందనే చెప్పాలి.

Advertisement

మరి ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్( Bollywood ) లో కూడా మంచి క్రేజ్ ను దక్కించుకున్నాడనేది మాత్రం వాస్తవం.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలపై ఫోకస్ పెట్టడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు.ఆయన ఆ తర్వాత చేయబోయే సినిమాల మీదైనా చాలా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఆయన తీసుకున్న స్టోరీ ఆయనకు భారీగా మైనస్ అయిందనే చెప్పాలి.

చూడాలి మరి రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది.ఇక ప్రస్తుతానికైతే వార్ 2 సినిమా మీదనే తను ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు సాగబోతున్నాడు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు