పార్టీ మార్పుపై రోజా క్లారిటీ ఇచ్చేసినట్టేనా  ? 

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసిపి( YCP ) ఓటమి చెందిన దగ్గర నుంచి అనేకమంది  వైసిపిని వీడి, ఇతర పార్టీలలో చేరిపోగా,  మరి కొంతమంది రాజకీయాలకు దూరమయ్యారు.

  ఇదే విధంగా నగరి నుంచి పోటీ చేసిన ఆర్కే రోజా కూడా ఓటమి చెందిన తర్వాత రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు.

  పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగానే ఉన్నారు.దీంతో రోజా(Roja ) త్వరలోనే వైసీపీని వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

ఆమె వైసీపీకి రాజీనామా చేసి , తమిళనాడులో విజయ్ దళపతి స్థాపించిన పార్టీలో చేరుతారనే హడావుడి కూడా నడిచింది.అయితే అకస్మాత్తుగా రోజా తాడేపల్లి లో జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

 గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించినా,  ఆ సమావేశానికి రోజా దూరంగానే ఉన్నారు.నిన్న తిరుపతి జిల్లా వైసీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షలో రోజా కూడా పాల్గొన్నారు .ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాల పైన జగన్(YS Jagan Mohan Reddy) తో చర్చించారు.పార్టీలోని ఇతర నేతలతో తనకున్న విభేదాలు , రాజకీయ ఇబ్బందుల పైన రోజా జగన్ తో చర్చించినట్లు సమాచారం.

Advertisement

ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో వైసిపి నేత ల భేటీకి సంబంధించిన ఫోటోలను,  జగన్ తో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు.ఈ విధంగా జగన్ తో ఫోటోలు బయటకు విడుదల చేయడం వెనక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

రోజా పార్టీని వీడుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో,  జగన్ తోనూ,  సమావేశం ఫోటోలు షేర్ చేయడం ద్వారా తాను వైసీపీని వీడుతున్నాను అనే వార్తలకు చెక్ పెట్టడంతో పాటు,  రాజకీయంగా జగన్ తోనే తన ప్రయాణం అనే సంకేతాలను రోజా ఇచ్చినట్లుగా అర్థం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు