ఏపీకి ఒక్క అవార్డు అయినా వచ్చిందా..?: మంత్రి గంగుల

విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు.విద్యావ్యవస్థలో కేరళను మించిపోయామన్నారు.

టీఎస్పీఎస్సీలో స్కామ్ ను బయటపెట్టిందని తమ ప్రభుత్వమేనన్న ఆయన తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు.ఏపీకి ఒక్కటైనా అవార్డు వచ్చిందా అని ప్రశ్నించారు.

తన వ్యాఖ్యలపై బొత్స స్పందించాలన్నారు.స్పందించిన తరువాతే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలని తెలిపారు.

పక్క రాష్ట్రంతో బాగుండాలని తాము కోరుకుంటున్నామన్నారు.తెలంగాణలో 1,009 గురుకులాలు ఉన్నాయన్న మంత్రి గంగుల ఏపీలో కేవలం 305 గురుకులాలే ఉన్నాయని తెలిపారు.

Advertisement

మంత్రి బొత్స తాను చెప్పేది వినాలని సూచించారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు