అట్లీని రిజెక్ట్ చేసి అల్లు అర్జున్ మంచి పని చేశాడా.. ఫలితాలు చూస్తే తేలింది ఇదే!

అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో నటిస్తున్న సమయంలో అట్లీ( Atlee ) అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది అంటూ కొద్ది రోజులపాటు చూసిన సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

దర్శకుడు అట్లీ బన్నీతో ప్రాజెక్టు లాక్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించినట్టు టాక్ వచ్చింది.

టీమ్ తో కలిసి స్టోరీ డిస్కషన్ చేస్తున్న ఫోటో ఒకటి అట్లీ భార్య ప్రియా ఒకసారి షేర్ చేయడంతో నిజమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఫ్యాన్స్ భావించారు.షారుఖ్ ఖాన్ కి జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనందంలో అట్లీ ఆ టైంలో మాములు దూకుడుగా లేదు.

అయితే ఆ తర్వాత ఏమయ్యిందో ఏమో కానీ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేకుండా అంతా సైలెంట్ అయ్యింది.

Did Allu Arjuns Decision Prove To Be Right Now Details, Allu Arjun, Tollywood, A

ఏమయ్యిందో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే స్టోరీ పరంగా అట్లీ చెప్పిన నెరేషన్ బన్నీని సంతృప్తిపరచలేదనే మాట ఇన్సైడ్ వర్గాల టాక్.ఇదంతా లోలోపల జరిగింది కాబట్టి ఎలాంటి అధికారిక ముద్ర లేదు.అయితే కట్ చేస్తే ఇప్పుడు బేబీ జాన్( Baby John ) బాలీవుడ్ ఆల్ టైం ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచేందుకు పరుగులు పెడుతోంది.

Advertisement
Did Allu Arjuns Decision Prove To Be Right Now Details, Allu Arjun, Tollywood, A

పేరుకి దర్శకుడు కలీస్ అయినప్పటికీ కర్త, కర్మ, క్రియ, నిర్మాతగా సర్వం చూసుకుంది అట్లీనే అని చెప్పాలి.ఎందుకంటే తేరి రీమేక్ కాబట్టి.వరుణ్ ధావన్( Varun Dhawan ) సూపర్ స్టార్ అవుతాడనే పెద్ద స్టేట్ మెంట్ కూడా అట్లీ ఇచ్చాడు.

తీరా చూస్తే బేబీ జాన్ దారుణంహా నిరాశపరిచింది.

Did Allu Arjuns Decision Prove To Be Right Now Details, Allu Arjun, Tollywood, A

నిజానికి అట్లీ గతంలో తీసిన సినిమాల కంటెంట్ మీద విమర్శలు ఉన్నాయి.అవి కమర్షియల్ గా సక్సెస్ కావడంతో మార్కెట్ పెరిగింది.గ్రాండియర్ పూతలో చాలా రొటీన్ కంటెంట్, గతంలో వచ్చిన కథలే మళ్ళీ తీస్తాడనే కామెంట్ ని అంత సులభంగా కొట్టిపారేయలేం.

శంకర్ ముద్ర తన మీద బలంగా ఉంది.సో పుష్పతో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో బన్నీ రాజీ పడటం లేదు.అందుకే అట్లీని గుడ్డిగా నమ్మకపోయి ఉండవచ్చనీ తెలుస్తోంది.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు