ఈ దొంగలు మామూలోళ్లు కాదు.. ధూమ్ సినిమాలో లాగా ఎలా చోరీ చేశారంటే..!

హృతిక్ రోషన్ తీసిన మూవీ ధూమ్ సినిమా మీరు చూసే ఉంటారు.ఇందులో హీరో చేసే తెలివైన దొంగతనాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి.

అయితే ఈ సినిమా చూసి కొందరు ఇన్స్‌స్పైర్ అయ్యి తాజాగా ఓ స్కూల్‌లో చోరీ చేశారు.అంతేకాదు ధూమ్ 4 రాబోతోందని ఒక హెచ్చరిక కూడా చేశారు.

దమ్ముంటే తమని పట్టుకోండి అని ఫోన్ నంబర్లు ఇచ్చి మరీ పోలీసులకు సవాల్ చేశారు.ఇప్పుడు ఏ చోరీ స్థానికంగానే కాదు దేశ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వివరాల్లోకి వెళితే.శుక్రవారం రాత్రి ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లోని ఓ స్కూల్‌లో దొంగలు పడ్డారు.

Advertisement

వీరు ఖరీదైన కంప్యూటర్లు, జెరాక్స్‌ మెషిన్లు, ప్రింటర్లు చోరీ చేశారు.ఇదంతా దొంగతనంలో జరగడం రొటీన్‌.

అయితే రొటీన్ కానిదేంటంటే ఈ దొంగలు ఒక బ్లాక్ బోర్డుపై "మేము ధూమ్.త్వరలోనే ధూమ్-4 చూపించబోతున్నాం.

ఇవిగో మా ఫోన్ నంబర్లు.దమ్ముంటే పట్టుకోండి" అని రాశారు.

దీంతో ఇది చూసిన వారంతా అవాక్కవుతున్నారు.పూరీ జగన్నాథుని రథయాత్ర వేళ శుక్రవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.

ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?

అయితే ఇదే అదునుగా భావించిన దొంగలు శుక్రవారం నాడే అన్ని ప్లాన్ చేసుకొని ఆ రాత్రి చోరీ చేశారు.అయితే శనివారం ఉదయం వచ్చిన ప్యూన్ కి ప్రిన్సిపాల్ రూమ్‌ డోర్‌ ఓపెన్ అయి ఉండటం కనిపించింది.దాంతో అతడు ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు.

Advertisement

వెంటనే హెడ్‌మాస్టర్‌కి ఈ విషయాన్ని తెలిపాడు.దీంతో హెడ్‌మాస్టర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్థలానికి వచ్చిన ఖతీగూడ పోలీసులు అన్నీ పరిశీలించారు.ఈ దొంగలను పట్టుకునేందుకు సైంటిఫిక్ టీమ్, డాగ్​ స్క్వాడ్​ సహాయం తీసుకుంటున్నారు.