ఢీ షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్... వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ షో కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న చైతన్య( Chaitanya ) ఆత్మహత్య చేసుకుని మరణించడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఈయన సూసైడ్( Sucide ) చేసుకొని చనిపోవడానికి ముందు సెల్ఫీ వీడియో ద్వారా తన సూసైడ్ కు గల కారణాలను తెలియజేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే చైతన్య కేవలం ఆర్థిక ఇబ్బందుల( Financial Probablem ) కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.ఈ వీడియోలో భాగంగా తాను ఆత్మహత్య చేసుకున్నందుకు తన తల్లిదండ్రులకు తోటి డాన్సర్లకు క్షమాపణలు తెలియజేశారు.

తనకు అప్పు ఇచ్చిన వాళ్ళ నుంచి అధికంగా ప్రెజర్ ఉందని అయితే ఎంత ప్రయత్నించినా అప్పు తీర్చడం తన వల్ల కాలేదని తెలిపారు.ఒక అప్పు తీర్చడం కోసం మరొకరి దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది.ఇలా ఈ బాధలు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఈ వీడియోలో తెలియజేశారు.

అయితే తనకు ఢీ షో ఎంతో పేరుతెచ్చి పెట్టిందని తాను ఎప్పటికీ ఈ కార్యక్రమానికి రుణపడి ఉంటానని తెలిపారు.ఈ షో ద్వారా తనకు పేరు వచ్చింది కానీ సంపాదన మాత్రం రాలేకపోయిందని ఆవేదన చెందారు.

Advertisement

ఇలా ఈ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తూ తన సూసైడ్ కు గల కారణాలను తెలియజేశారు.నెల్లూరులోని క్లబ్ హోటల్లో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసి కేసు నమోదు చేసుకున్నారు.ఇలా చైతన్య మరణ వార్త తెలిసినటువంటి తోటి డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో నెల్లూరులోని కళాంజలి సమస్థ ఆధ్వర్యంలో ఈయనకు ఘనంగా సన్మానం జరిగింది.ఇలా శనివారం చాలా చలాకీగా ఉన్నటువంటి చైతన్య ఆదివారం ఇలా విజేతజీవిగా పడి ఉండటంతో స్నేహితులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement
https://www.youtube.com/live/85xgMc7l2js?feature=share

తాజా వార్తలు