సాధారణంగా ఏ ప్రాజెక్ట్ విషయంలో అయినా నిర్మాతకు మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి.
నిర్మాత కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన సినిమా కాబట్టి నిర్మాత అనుమతులు లేకుండా అందులోని కంటెంట్ ను ఉపయోగించకూడదు.
స్టార్ హీరోయిన్ నయనతారకు( Nayanthara ) తాజాగా మరో భారీ షాక్ తగిలింది.నయనతారను హెచ్చరిస్తూ ధనుష్( Dhanush ) లాయర్ మరో నోటీస్ పంపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
నయనతార డాక్యుమెంటరీ( Nayanthara Documentary ) ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఇందులో ధనుష్ 10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని దావా వేసిన షాట్స్ సైతం ఉన్నాయి.ఈ విషయంలో నయన్ ను హెచ్చరిస్తూ ధనుష్ తరపు లాయర్ మరో నోటీస్ పంపారు.
నయనతార డాక్యుమెంటరీలో తమకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరడం గమనార్హం.ఈ మేరకు ఇప్పటికే నోటీసులు పంపామని ఆయన చెప్పుకొచ్చారు.
ధనుష్ అడ్వకేట్ నయనతారతో పాటు నెట్ ఫ్లిక్స్ కు( Netflix ) సైతం నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.ధనుష్ గతంలో నయనతార వ్యవ్హహరించిన తీరు విషయంలో హర్ట్ అయ్యారని అందుకే ఈ విధంగా చేశారని సమాచారం అందుతోంది.
ఈ వివాదం విషయంలో ధనుష్ ను ఏ మాత్రం తప్పు పట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ధనుష్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.నయనతార వెనక్కు తగ్గకపోతే మాత్రం ధనుష్ మరింత కఠినంగా వ్యవహరించే ఛాన్స్ అయితే ఉంది.
నయనతార తెగే వరకు లాగుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.నయనతార తీరు విషయంలో సైతం ఒకింత విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నయనతారకు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy