కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటం కోసం పోలీసులకు హాలిడే ఇచ్చిన డీజీపీ..!

ప్రస్తుతం ఎవరి నోట విన్న ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా మాట వినబడుతుంది.దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుంది.

దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ఈ సినిమాని తెరకెక్కించారు.1990లో జమ్మూ కశ్మీర్ పండిట్ల వలసలు, వారు పడ్డ ఇబ్బందుల గురించి చూపిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా విడుదల అయ్యి అనూహ్యమైన స్పందన దక్కించుకుంది.చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఎవరు చూసినా ఈ సినిమా గురించి మాట్లాడటమే కాకుండా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమా విడుదల సమయంలో అతి తక్కువ థియేటర్లలో విడుదలైంది.అయితే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో థియేటర్ల సంఖ్య పెరిగిపోయింది.

అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారు.

తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులు ఈ సినిమాని చూడటం కోసం ఒక రోజు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూడటానికి వీలుగా సెలవలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వారు కోరుకున్న రోజు సెలవు తీసుకోవచ్చని మహారాష్ట్ర డీజీపీ వెల్లడించారు.

బిడ్డకు అన్నప్రాసన కార్యక్రమం ఏ సమయంలో చేయాలో తెలుసా..!
Advertisement
" autoplay>