సలార్ సినిమా కి పోటీగా వస్తున్న డెవిల్...

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంటారు.

ఇక ఇలాంటి క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కళ్యాణ్ రామ్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇక తను ఇప్పుడు డెవిల్( Devil ) అనే సినిమాతో ప్రేక్షకులు ఆకట్టుకోవడానికి డిసెంబర్ 29 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక ఈ సినిమా పిరియాడికల్ మూవీ గా తెరకెక్కుతుంది.

ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో కళ్యాణ్ రామ్ మరోసారి బాక్స్ office దగ్గర తన పంజా ని చూపించడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఇప్పటికే బింబిసార తో ఒక అదిరిపోయే హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ మధ్యలో ఒక సినిమాతో ఫ్లాప్ ని మూట కట్టుకున్నాడు.అయినప్పటికీ తను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి డెవిల్ సినిమా రూపంలో సక్సెస్ ని కొట్టడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.ఇక డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి వస్తుంటే ఈ సినిమా మీద ప్రభాస్ సలార్ సినిమా( Salaar ) ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని కూడా సగటు అభిమానులు ఆరా తీస్తున్నారు.

Advertisement

ఇక ఇప్పటికే అనిమల్ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో దానికి వారం తర్వాత వచ్చిన నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.ఇక ఇప్పుడు సలార్ సినిమా కి పాజిటివ్ టాక్ వస్తే డెవిల్ పరిస్థితి ఏంటి అంటూ మరికొంత మంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక ఇదే క్రమం లి కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాని ఇంకొక వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకొని ఉంటే బాగుండేది అంటూ కొందరు చెప్తుంటే మరి కొంత మంది మాత్రం ఇంకొక వన్ వీక్ వెనక్కి వెళితే సంక్రాంతి సినిమాలు బరిలోకి దిగుతాయి కాబట్టి ఇప్పుడు రావడమే కరెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి కళ్యాణ్ రామ్ సినిమా ప్రభాస్ సలార్ సినిమాను తట్టుకొని నిలబడబడుతుందా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు