థమన్ అయిపోయాడు.. ఇప్పుడు దేవిశ్రీ రెడీ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో అదిరిపోయే రికార్డును బన్నీ తనపేరుపై నమోదు చేసుకున్నాడు.

ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన నాన్-బాహుబలి రికార్డుల గురించి అందరికీ తెలిసిందే.కాగా ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగా, థమన్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

Devi Sri Prasad To Create Record With Pushpa, Devi Sri Prasad, Pushpa, Allu Arju

ఈ సినిమాలో థమన్ అందించిన మ్యూజిక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.కాగా ఈ సినిమాతో థమన్ కెరీర్ బెస్ట్ మ్యూజిక్‌ను అందించి పలు రికార్డులు సాధించాడు.

ఇప్పుడు బన్నీ సినిమాతో మరో మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త రికార్డులు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.టాలీవుడ్ రాక్‌స్టార్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రానికి సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు.పుష్ప సినిమా కోసం దేవిశ్రీ సరికొత్త ట్యూన్స్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో బెస్ట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో బన్నీ కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనదైన శైలిలో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఇక పూర్తి ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది.

వేగములు ఎన్ని, అవి ఏవి?
Advertisement

తాజా వార్తలు