పుష్ప 2 ప్రతి సీనుకి దిమ్మ తిరిగి పోవాల్సిందే.. అంచనాలను పెంచేసిన దేవిశ్రీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలను సృష్టించిన అల్లు అర్జున్ ఈ సీక్వెల్ సినిమా ద్వారా డిసెంబర్ ఆరవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి.

తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ( Devi sri prasad ) పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయని చెప్పాలి.ఈనెల 19న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్ప 2 గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు.

పుష్ప 2 అసలు తగ్గేదేలే అనే విధంగా ఉంటుందని తెలిపారు.ఇప్పటికే నేను ఫస్ట్ ఆఫ్ చూసాను ప్రతి సీనుకు దిమ్మతిరిగి పోవాల్సిందే అంత అద్భుతంగా సినిమా వచ్చిందని తెలిపారు.

Advertisement

ఈ సినిమా షూటింగుకు ముందే సుకుమార్ ( Sukumar ) గారు నాకు ఈ సినిమా కథ చెప్పారు.అప్పుడే చాలా బాగా నచ్చింది ఆయన చెప్పిన విధంగానే ఈ సినిమాని చేశారని దేవి శ్రీ వెల్లడించారు.పుష్ప వరల్డ్ ప్రారంభమయ్యాక ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ లా ఉంటుంది.

అడియన్స్ నిరాశ పరిచేలా ఒక్క సీన్ కూడా ఉండదు.ఇక అల్లు అర్జున్ కూడా తన నటనతో విశ్వరూపం చూపించబోతున్నారని ఈ సందర్భంగా దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 సినిమా గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు