పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన దేవి శ్రీ.... షూటింగ్  ప్రారంభమయ్యేది అప్పుడేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ఇటీవల  పుష్ప 2 ( Pushpa 2 ) నిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా రికార్డులను సృష్టించింది.

ఇలా పుష్ప, పుష్ప2 సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.త్వరలోనే పుష్ప 3 కూడా ఉండబోతుందని మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Devi Sri Prasad Gives Big Update On Pushpa 3, Allu Arjun, Sukumar, Devi Sri Pras

ఇకపోతే తాజాగా పుష్ప 3 గురించి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad ) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కీలక అప్డేట్ ఇచ్చారు.డైరెక్టర్ సుకుమార్( Sukumar ) ఇప్పటికే పార్ట్ 3 కి సంబంధించిన పనులు కూడా ప్రారంభించారని దేవి శ్రీ ప్రసాద్ వెల్లడించారు.ఆ స్టోరీపై రీవర్క్‌ కూడా చేస్తున్నారని తెలిపారు.

పుష్ప 2 భారీ సక్సెస్ కావడంతో పార్ట్ 3 పై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉంటాయి.దీంతో మీపై ఏదైనా ఒత్తిడి ఉంటుందా అనే ప్రశ్న కూడా ఈయనకు ఎదురయింది.

Devi Sri Prasad Gives Big Update On Pushpa 3, Allu Arjun, Sukumar, Devi Sri Pras
Advertisement
Devi Sri Prasad Gives Big Update On Pushpa 3, Allu Arjun, Sukumar, Devi Sri Pras

ఈ ప్రశ్నకు దేవిశ్రీ సమాధానం చెబుతూ.వృత్తిపరంగా నేనెప్పుడూ టెన్షన్‌ పడను.ఒత్తిడి ఉంటే క్రియేటివిటీ ఉండదు.

పుష్ప 2 కి ది బెస్ట్‌ ఇవ్వాలని నేను, సుకుమార్‌, పాటల రచయిత చంద్రబోస్‌ ముందు నుంచీ అనుకుని అదే విధంగా పని చేసామని తెలిపారు.సుకుమార్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు అల్లు అర్జున్ అద్భుతంగా నటించారు.

ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్ లందరూ కూడా అదే స్థాయిలో కష్టపడ్డారని తెలిపారు.పుష్ప 1, పార్ట్ 2 కి ఏ విధంగా అయితే కష్టపడ్డామో, పార్ట్-3 కి కూడా అలాగే కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

సుకుమార్ గారి విజన్ ఆయన స్టోరీలు మాకెంతో స్ఫూర్తి అని తెలిపారు.ఇక సుకుమార్ గారు ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు అలాగే అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా కమిట్ అయ్యారు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!

బన్నీతో సినిమా చేయడం కోసం మరి కొంతమంది డైరెక్టర్స్ కూడా కమిట్ అయ్యారు ఈ సినిమాలన్నీ పూర్తి అయిన వెంటనే పార్ట్-3 షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ దేవిశ్రీప్రసాద్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు