ఏపీలో రూ.278 కోట్ల నిధులతో ఆలయాలు అభివృద్ధి

ఏపీలో 1,468 దేవాలయాలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి కొట్టు అన్నారు.రూ.278 కోట్ల సీజీఎఫ్ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

ఆలయాలను డెవలప్ చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.

ఈ మేరకు కొత్తగా వచ్చిన వినతులను సైతం పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.అనంతరం లోకేశ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పాదయాత్రలో లోకేశ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చాక అంతు చూస్తామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు.అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ఎంపీల నుంచి ఎంపీటీసీల వరకు టికెట్లు అమ్ముకున్న చరిత్ర టీడీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు