చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుంది - బాలకృష్ణ

చిత్తూరు అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యమవుతుందని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.సోమవారం రాత్రి చిత్తూరులోని గాంధీ సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగించారు.

భారీగా తరలివచ్చిన జన సందోహం మధ్య బాలకృష్ణ ప్రసంగం సాగింది.చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్ కి టికెట్ ఇచ్చి వైసిపి అరాచకాలను ప్రోత్సహిస్తుందని బాలకృష్ణ చెప్పారు.

చిత్తూరు ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు.చిత్తూరు -బెంగుళూరు జాతీయ రహదారిలో నగర శివారులో బాలకృష్ణకు చిత్తూరు తెలుగుదేశం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో గజమాలతో బాలకృష్ణకు స్వాగతం పలికి నగరంలోనికి తీసుకువచ్చారు.బాలకృష్ణను చూడడానికి పెద్ద సంఖ్యలో జనం గాంధీ సర్కిల్ వద్ద పోటెత్తారు.

Advertisement

సభకు హాజరైన యువతను ఉత్తేజపరిచేలా బాలకృష్ణ ప్రసంగించారు.యువ రక్తం, అనుభవం కలయికగా తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు.

సోమవారం రాత్రి చిత్తూరులో లోని గాంధీ సర్కిల్ లో జరిగిన బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడారు.అందరికీ అందుబాటులో ఉంటూ, తలలో నాలుకలా ఉండే గురజాల జగన్మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు బాలకృష్ణ చెప్పారు.

ఉత్సాహం, మేధస్సు కలయికగా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.కూటమి అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బాలకృష్ణ కోరారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు