కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఏపీ అభివృద్ధి..: వైఎస్ షర్మిల

ఏపీ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( PCC President YS Sharmila )అన్నారు.

కడప జిల్లాలోని ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల అనంతరం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి గతంలో చంద్రబాబు( Chandrababu ), ప్రస్తుతం వైఎస్ జగనే కారణమని ఆరోపించారు.రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవన్నారు.

ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని షర్మిల తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సాధ్యం అవుతాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆమె కోరారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు