కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యం..: రఘువీరా రెడ్డి

కాంగ్రెస్ తోనే ఏపీ అభివృద్ధి (Development) సాధ్యమని ఆ పార్టీ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు.కాంగ్రెస్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.

వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ (Congress)ను వీడిన వారంతా తిరిగి రావాలని రఘువీరా రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ కల్యాణ్ అని తెలిపారు.

28 రాష్ట్రాల్లో బీజేపీ (BJP) అంటే భారతీయ జనతా పార్టీ కానీ ఏపీలో మాత్రం బాబు, జగన్, పవన్ అని విమర్శించారు.కేంద్రంలోని మోదీకి చంద్రబాబు, జగన్, పవన్ కట్టుబానిసలని విమర్శించారు.వాళ్లకు ఓటు వేయడం అంటే బీజేపీకి వేసినట్లేనన్నారు.

దీన్ని ప్రజలు గుర్తించాలన్నారు.అలాగే ఆరు నూరైనా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి (Rahul Gandhi Prime Minister) అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు