యునానిమస్ హిట్ టాక్ వస్తే దేవరను ఆపేదెవ్వరు.. సంచలన రికార్డులు మాత్రం పక్కా!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా దేవర సినిమా( Devara Movie ) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన దేవర సినిమా ఈనెల 27న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

అయితే ఈ సినిమా విడుదలకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.

అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.కాగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా మేనియా కనిపిస్తోంది.

మరోవైపు దేవర సినిమా ఫ్రీ రిలీజ్ బుకింగ్ రికార్డు స్థాయిలో ఉన్నాయి.మరి ముఖ్యంగా ఓవర్సీస్ లో నాన్ బాహుబలి రికార్డులను( Non Baahubali Records ) అందుకునే దిశగా రిలీజ్ కు ముందు దేవర టికెట్లు తెగుతున్నాయి.తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో కూడా ప్రమోషన్స్ విభాగంలో బాగా వీక్ గా కనపడుతున్నప్పటికీ, భారీ హైప్ రావడం ఓపెనింగ్స్ కు దోహదం చేస్తుంది.

Advertisement

ఇదే ఊపులో కంటెంట్ గనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే పుష్ప మాదిరి ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వెళ్లనుంది దేవర సినిమా.అయితే మొత్తం అయిదు భాషలలో విడుదల కాబోతున్న దేవర కు తెలుగు, హిందీలతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ వారం పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

ఈ వీకెండ్ తో పాటు తదుపరి వారం నుండి దసరా పర్వదినం సెలవులు కావడంతో బాక్సాఫీస్ వద్ద దేవర దూకుడుకు అదుపులో ఉండకపోవచ్చు.అయితే కావాల్సిందల్లా పాజిటివ్ టాక్ మాత్రమే.ప్రీమియర్ షోస్ నుండి ఆ ఒక్కటి గనుక వస్తే, బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన రికార్డులను దేవర అందుకుంటాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అర్ధరాత్రి షోస్ కు అనుమతులు రావడంతో, అభిమానులు బెనిఫిట్ షోలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.క్లైమాక్స్ లో తదుపరి పార్ట్ కు సంబంధించిన ట్విస్ట్, సస్పెన్స్ ఉంటుందని దర్శకుడు కొరటాల శివ( Koratala Siva ) ఇచ్చిన హింట్, బాహుబలి రేంజ్ లో వర్కౌట్ అయితే దేవర గట్టెక్కినట్లే అని చెప్పాలి.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు హిట్టే టాక్ వస్తే ఈ సినిమా రికార్డులను కొల్లగొట్టడం ఖాయం అని తెలుస్తోంది.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి మరి.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?
Advertisement

తాజా వార్తలు