దేవర సంచలనాలు షురూ.. తెలుగు వెర్షన్ తోనే సంచలనాలు క్రియేట్ అవుతున్నాయా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ( Hero Junior NTR )గురించి మనందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

ఈ పాన్ ఇండియా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్( RRR ) తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.ఇకపోతే ప్రస్తుతం దేవర పైనే అందరి దృష్టి ఉంది.

Advertisement

ఆ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తున్నాయి.ముఖ్యంగా సాంగ్స్ ఒక ఊపు ఊపుతున్నాయి.

దేవర ఫస్ట్ సింగిల్ గా విడుదలైన ఫియర్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఇక సెకండ్ సింగిల్ గా విడుదలైన చుట్టమల్లే సాంగ్ అంతకుమించి అన్నట్టుగా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

చుట్టమల్లే సాంగ్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది.యూట్యూబ్ లో తెలుగు వెర్షన్ కే 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ కి చేరువైంది.

ఇక మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ స్పాటిఫైలో కూడా చుట్టమల్లే సాంగ్ దుమ్మురేపుతోంది.ఒక్క రోజులోనే 1 మిలియన్ కి పైగా స్ట్రీమ్స్ ని సొంతం చేసుకొని సరికొత్త రికార్డుని సృష్టించింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు సాంగ్ చుట్టమల్లే కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు