పెరోల్ పై డేరా బాబా విడుదల..!

డేరా బాబా అలియాస్ డేరా సచ్చా సౌదా చీణ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పెరోల్ పై విడుదల అయ్యారు.

ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం కేసులో ఆయనకు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఈ కేసులో భాగంగా తాజాగా హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేసింది.దీంతో జైలు నిబంధనలు పూర్తి చేసుకుని రోహ్ తక్ జిల్లా సునరియా జైలు నుంచి బయటకు వచ్చారు.

దీనికి ముందు మూడు నెలల క్రితం కూడా ఇదే తరహాలో డేరా బాబా పెరోల్ పై విడుదలయ్యారు.నిబంధనల ప్రకారం తాజాగా 40 రోజుల బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.

అయితే ఈనెల 25న జరిగు సచ్చా సౌదా మాజీ చీఫ్ షా సత్నం సింగ్ జయంతికి డేరా బాబా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు