చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హంతకరత్న, వెన్నుపోటు పితామహుడు అనే అవార్డులను మహానాడులో చంద్రబాబుకు ఇవ్వాలని తీర్మానం చేయాలని విమర్శించారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబని మంత్రి కొట్టు ఎద్దేవా చేశారు.మహానాడుకు 15 లక్షల మంది వస్తారని డబ్బా కొట్టుకుంటున్నారన్నారు.

మహానాడుకు కనీసం రెండు లక్షల మంది కూడా రారని చెప్పారు.రాజకీయ కుట్ర కోసం మహానాడుకు జనసమీకరణ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ జనాలు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శలు చేశారు.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు