Delivery Boy : మహిళా కస్టమర్‌ని ముద్దుపెట్టబోయి గుద్దులు తిన్న డెలివరీ బోయ్!

ఈమధ్య కొంతమంది డెలివరీ బాయ్స్ పెచ్చుమీరి పోతున్నారు.ప్రస్తుతం జనాలు కూరగాయాలనుండి బట్టల వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నారు.

ముఖ్యంగా ఇంటి పట్టున వున్న లేడీస్ ఎక్కువ మంది ఆన్లైన్ మాధ్యమాల ద్వారానే షాపింగ్ చేసేస్తున్నారు.దాంతో ఇంటి యజమానికి పని తగ్గుతుంది.

బోలెడంత సమయం ఆదా అవుతుంది.అయితే ఈ క్రమంలో కొన్ని అపశృతులు చోటుచేసుకుంటున్నాయి.

బేసిగ్గా డెలివరీ బాయ్స్ అనేవారు సార్ లేదా మాడమ్ అంటూ వినయంగా, మర్యాదగా పలకరించి మరీ డెలివరీ చేసిన ఐటెంని ఇస్తారు.అయితే కొంతమంది మాత్రం కస్టమర్లు ఆడవారు అయితే కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నారు.

Advertisement

ఇపుడు అలాంటి ఓ బాయ్ గురించి మాట్లాడుకుంటున్నాం.వివరాల్లోకి వెళితే, బ్రిటన్‌లోని మెరిడెన్ ఎస్టేట్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులు ఆర్డర్‌ పెట్టింది.కాసేపటికి ఆ సరుకులను ఒక డెలివరీ బాయ్ తన ఇంటికి తీసుకువచ్చాడు.60 ఏళ్ల వయస్సుగల ఆ డెలివరీ బాయ్ కి ఆ మహిళను చూడగానే మరి కోరిక కలిగిందేమో మరి, సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోగా మరి కొన్ని సెకెన్లలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది.మహిళ అనుమానంగానే వెళ్ళి తలుపు తీయగా మళ్ళీ ఆ డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు.

దాంతో అతను ఏదైనా ఇవ్వడం మరిచిపోయాడేమో అనుకుందామె.

అయితే ఆ డెలివరీ బాయ్ చిత్రంగా ‘దయచేసి మీ వయసెంతో చెబుతారా?’ అని అడిగాడు.ఆమె 33సంవత్సరాలని చెప్పింది.అలా చెప్పగానే సదరు డెలివరీ బాయ్ చటుక్కుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకోవాలని చూసాడు.

అతని తీరుపై అప్పటికే అనుమానంగా ఉన్న ఆమె అంతకంటే వేగంగా తప్పించుకుంది.కాగా ఈ తంతంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

ఈ ఘటన షాక్ అయిన ఆమె కాసేపటికి తేరుకుని సదరు కంపెనీ వారిపై విరుచుకుపడింది.మహిళ ఫిర్యాదుకు స్పందించిన టెస్కో కస్టమర్ కు తమ డెలివరీ బాయ్ చర్యలకు క్షమాపణలు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు