రక్త పిశాచుల మధ్య రుచికరమైన భోజనం!

భయం కూడా ఒక మంచి థ్రిల్‌ను అందిస్తుంది.అందుకే హారర్ సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.

హారర్ సినిమాలు మాత్రమే కాదు దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు, ప్రదేశాలు కూడా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే ప్రజలలోని ఈ వీక్ నెస్ ని తమ వ్యాపారానికి పెట్టుబడి పెట్టాడు ఒక రెస్టారెంట్ యజమాని.

తమ రెస్టారెంట్‌లో రక్త పిశాచుల మధ్య తిండి తింటూనే భయపడచ్చొని, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ పొందొచ్చని యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు.దీంతో హారర్ లవర్స్ అందరూ ఈ రెస్టారెంట్ కి క్యూ కడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.సౌదీ అరేబియాలోని రియాద్‌లో కొద్దిరోజుల క్రితమే షాడోస్‌ అనే రెస్టారెంట్‌ ప్రారంభమైంది.

Advertisement

ఆ రెస్టారెంట్‌ బయటి నుంచి అన్ని రెస్టారెంట్‌ల మాదిరిగానే సాధారణంగా కనిపిస్తుంది.కాస్త దగ్గరకు వెళితే మాత్రం అద్దాల్లోంచి దెయ్యాల నీడలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.

రెస్టారెంట్‌పైన చింతనిప్పుల్లా ఎర్రగా మెరిసే కళ్లతో గబ్బిలాల బొమ్మలు కనిపిస్తాయి.ఇవి ఆ రెస్టారెంట్‌కు వెళ్లే కస్టమర్లను బాగా భయపెడతాయి.

ఒక దెయ్యాల కొంపలాగా ఉండే ఈ రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు కస్టమర్లు చాలా బెదిరిపోతుంటారు.లోపలికి అడుగుపెట్టాక మసక చీకటిలో జాంబీస్‌, రక్త పిశాచులు, వింత దెయ్యాలు రెస్టారెంట్‌లో విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.ఇలాంటి భయంకరమైన ఆకారాలు చుట్టూ తిరుగుతుంటే ఆహారం తినాల్సి ఉంటుంది.

అయితే ఎంత ధైర్యం ఉన్నా కూడా ఈ రెస్టారెంట్ లోకి వస్తే భయపడక తప్పదని కస్టమర్లు అంటున్నారు.రెస్టారెంట్ వాతావరణం అలవాటైతే మాత్రం టేస్టీ ఫుడ్ హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?

ఏదిఏమైనా ఈ క్రేజీ ఐడియా బాగా వర్కౌట్ అవ్వడంతో కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.రక్త పిశాచుల మధ్య భోజనం చేసేందుకు కస్టమర్లు బాగా ఆసక్తి కనబరుస్తున్నారని, కస్టమర్లు తాకిడి పెరుగుతోందని యజమాని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు