ఆన్‌లైన్‌లో ఘరానా మోసం.. ఐఫోన్ మోజులో సైబర్ వలలో చిక్కిన యువకుడు..!

ఆన్‌లైన్‌లో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి.

ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లాంటి వాటిలో డిస్కౌంట్ ల పేరుతో నకిలీ పోస్ట్లు పెట్టి వినియోగదారులను ఆకర్షించి లక్షల్లో దోపిడీలు వచ్చేస్తున్నారు.

ఒక యువకుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ డిస్కౌంట్ లో ఐఫోన్ అనే పోస్ట్ చూసి కొనుగోలు చేసే ప్రయత్నంలో సుమారుగా 29 లక్షలు పోగొట్టుకున్న సంఘటన న్యూఢిల్లీలోని ఘిటోర్నీ ప్రాంతంలో జరిగింది.తాను మోసపోయిన విషయం గ్రహించిన యువకుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

వికాస్ కటియార్ అనే యువకుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను ఇంస్టాగ్రామ్ లో ఐఫోన్ కు సంబంధించిన ఒక పోస్టును చూశానని, అది నిజమో కాదో తెలుసుకోవడం కోసం మరొక ఇంస్టాగ్రామ్ పేజీ నుంచి పాత కొనుగోలుదారులను సంప్రదించి ఇది నిజమే అని నిర్ధారించుకున్నాడు.తాను కూడా తక్కువ ధరకు వచ్చే ఐఫోన్ కొనాలని భావించిన వికాస్ ఫిబ్రవరి 6న ఇంస్టాగ్రామ్ పోస్టులో ఉండే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు.అవతల నుండి అడ్వాన్స్ పేమెంట్ గా రూ.28 వేలు చెల్లించాలని తెలిపారు.ఆ ఇంస్టాగ్రామ్ గ్రూపులోని మిగతా సభ్యులు కస్టమ్స్, ఇతర పన్నులను చెల్లించాలి అనే వంకతో అదనపు డబ్బులు చేశారు.

ఇలా గ్రూప్లోని సభ్యులంతా వికాస్ తో దాదాపు రూ.28,69,850 చెల్లించుకున్నారు.ఢిల్లీలోని సౌత్ వెస్ట్ జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

Advertisement

బాధిత వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పేరు తెలియని వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆన్లైన్లో ఏవైనా వస్తువులు కొంటే, పేమెంట్ ఆన్లైన్ కాకుండా ఆఫ్ లైన్ డెలివరీ ఆప్షన్ తో ఆర్డర్ చేస్తే ఇటువంటి మోసాలు జరగవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఆన్లైన్లో కొనేముందు ఆ వెబ్సైట్ రియల్ అవునో కాదో చెక్ చేసుకోవాలి.ఎప్పుడైతే ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ చేతికి వస్తుందో అప్పుడే డబ్బులు చెల్లించాలి అని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు