ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో అరెస్ట్ అయిన విజయ్ నాయర్ ఈడీ కస్టడీ ముగిసింది.

ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరు పరచనున్నారు.అదేవిధంగా దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించనున్నారు.

విజయ్ నాయర్ ను జ్యుడీషియల్ కస్టడీకి కోరే అవకాశం ఉంది.ఇదే కేసులో అభిషేక్ బోయినపల్లికి డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.

అయితే త్వరలోనే లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసులో ఈడీ తొలి చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.కాగా లిక్కర్ కుంభకోణం ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023