ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు( Delhi high court )లో విచారణ జరగనుంది.

లిక్కర్ స్కాం కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేశారు.

ఎటువంటి ఆధారాలు లేకుండా లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కేసు వాస్తవాలను న్యాయస్థానం పరిశీలించాలని ఆమె కోరారు.

సుమారు 1149 పేజీలతో కవిత తరపున న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.,/br>తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె ధర్మాసనాన్ని కోరారు.

అయితే ఈ నెల 6న కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players