Bilateral Hand Transplant : వైరల్: వైద్యశాస్త్రంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఢిల్లీ వైద్యులు..!

ప్రస్తుత ఆధునిక యుగంలో రోజుకు ఒక కొత్త టెక్నాలజీతో అనేక విన్నమైన పరికరాలు అందుబాటులోకి రావడం మనం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం.

టెక్నాలజీ పెరగడం ద్వారా మనిషి ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయింది.

ఇలా టెక్నాలజీ పెరిగిన కొద్దీ కొన్ని రకాలుగా మంచి జరుగుతున్న.కొన్ని రకాలుగా మాత్రం కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఇకపోతే మానవ సృష్టిలో తల్లి గర్భంలోనే మనిషి అన్ని అవయవాలతో రూపుదిద్దుకొని భూమి పైకి వస్తారు.ఒకవేళ శరీర భాగాల్లో ఏదైనా డ్యామేజ్ అయ్యి దానిని శరీరం నుంచి వేరు చేసిన తర్వాత తిరిగి పొందే అవకాశం చాలా అరుదు.

బయట మార్కెట్లో వాహనాలకు స్పేర్ పార్ట్స్ దొరికినట్లుగా మనిషి అవయవాలు దొరకవు.

Advertisement

కాబట్టి ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలు కోల్పోయినప్పుడు మిగతా జీవితాంతం ఆ మనిషి అవిటి మనిషిగా ఉండిపోవాల్సి వస్తుంది.అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన మెడికల్ చరిత్రలోనే మిరాకిల్ గా మారింది.తాజాగా ఢిల్లీలోని వైద్యులు( Delhi Doctors ) కొత్త సర్జరీతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

ఢిల్లీలో నివసిస్తున్న ఓ చిత్రకారుడు( Painter ) అనుకోకుండా రైలు ప్రమాదంలో రెండు చేతులను కోల్పోయాడు.దీంతో అతను జీవితంలో పెయింటింగ్ వేసే అవకాశం కోల్పోయాడు.

కాకపోతే పరిస్థితి ఇలా ఉన్న సమయంలో ఓ మహిళ వల్ల అతనికి మళ్ళీ చేతులు లభించాయి.ఓ మహిళ తాజాగా బ్రెయిన్ డెడ్( Brain Dead ) కావడంతో దాంతో ఆమెకు ఉన్న అవయవాల్లో చేతులను( Hands ) ఆమె నుండి వేరుచేసి ఆక్సిడెంట్ లో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి సర్జరీ ద్వారా మార్పిడి చేశారు.బ్రెయిన్ డెడ్ అయిన మహిళ నుండి మరో నలుగురికి అవయవ దానం చేశారు.

చేతులు తిరిగి పొందిన ఆ 45 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం చేతులు వచ్చినందుకు గాను సంతోషం వ్యక్తం చేశాడు.ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆ చిత్రకారుడు వైద్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రేమ వ్యవహారం విషాదాంతం..యువకుడి ఆత్మహత్య
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

మొత్తానికి ఢిల్లీ వైద్యులు వైద్య చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించారు.ప్రస్తుతం ఈ సర్జరీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు