డి విటమిన్ లోపంతో గుండె సంబంధిత సమస్యలతో పాటు ఇంకెన్నో అనారోగ్య సమస్యలు..?

ఈ ప్రకృతిలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యల( Health problems )కు చికిత్సను అందించే ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి.

ఇందుకు సరైన ఉదాహరణ విటమిన్ డి( Vitamin D ) అని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎందుకంటే విటమిన్ డి అందరికీ ఉచితంగా సూర్యుడి నుంచి లభిస్తుంది.ఎత్తైన బంగ్లాలలో, అపార్ట్ మెంట్ లలో ఎండ తగలకుండా తలుపులు మూసుకుని ఉండే ప్రస్తుత రోజులలో చాలామంది ప్రజలలో విటమిన్ డి లోపం ఏర్పడింది.

విటమిన్ డి తక్కువైతే క్యాల్షియం తక్కువ అవుతుందని,అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందని చాలామందికి తెలుసు.

Deficiency Of Vitamin D Causes Many Other Health Problems Besides Heart Related

కానీ దీని లోపం ఒక వైపు రక్తంలో పీడనాన్ని, గుండె జబ్బుల( Heart disease ) రిస్క్ ను కూడా పెంచుతుందని చాలా అధ్యయనాలలో తెలిసింది.ముఖ్యంగా చెప్పాలంటే ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి ఎంతో అవసరం అని పరిశోధకులు చెబుతున్నారు.సూర్య రశ్మి ద్వారా లభించే విటమిన్ డి శరీరంలో ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.

Advertisement
Deficiency Of Vitamin D Causes Many Other Health Problems Besides Heart Related

ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ డి లోపం వల్ల రక్తపోటు( Blood pressure ) పెరిగి గుండె రక్తనాళాల వ్యాధుల రిస్కు పెరుగుతుంది.అందుకే ఒక వ్యక్తి శరీరంలో డి విటమిన్ స్థాయిలను బట్టి కార్డియో వాస్కులర్ రిస్కు ఏ మేరకు ఉంటుందో అంచనా వేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Deficiency Of Vitamin D Causes Many Other Health Problems Besides Heart Related

శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే జీవ రసాయన చర్యలు సరిగ్గా జరిగి రక్తపోటు అదుపులో ఉంటుంది.కొవ్వులో కరిగే విటమిన్ డి2, డి3 అనే రెండు రకాలుగా ఉంటుంది.ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి వచ్చిన కొన్ని రకాల ఆహార పదార్థాలలో మాత్రమే దొరుకుతుంది.

దంతాలు, ఎముకల పెరుగుదలకు అలాగే అవి బలంగా ఉండడానికి విటమిన్ డి ఎంతో అవసరం.వీటి ఎదుగుదలకు తోడ్పడే క్యాల్షియం శరీరానికి ఉపయోగపడాలంటే విటమిన్ డి కచ్చితంగా ఉండాల్సిందే.

వ్యాధి నిరోధక వ్యవస్థ( Immune system ) శక్తివంతంగా పనిచేయడానికి విటమిన్ డి ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే విటమిన్ డి లోపానికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు