జింకపైకి అమాంతంగా దూకిన మొసలి.. తర్వాత ఏమైందంటే

అడవిలో ఏ జీవి అయితే బలంగా ఉంటుందో, అదే ఆ ప్రాంతానికి రాజు అనే సామెత ఉంది.సింహం అడవికి రాజు.

ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.అయితే అడవిలో ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ నీటిలో మాత్రం మొసలి రారాజు.

బలమైన ఏనుగు వచ్చినా దానిని సైతం మట్టికరిపించగల సత్తా మొసలికి ఉంది.అందుకే మొసలి జోలికి వెళ్లాలంటే సింహం, ఏనుగు కూడా భయపడతాయి.

అలాంటి మొసలి నుంచి తప్పించుకోవడం ఇతర చిన్న జీవులకు మాత్రం అసాధ్యం.అయితే ఓ జింక మాత్రం చాలా తెలివిగా మొసలి నోటి నుంచి తప్పించుకుంది.

Advertisement

త్రుటిలో మొసలి చేతికి చిక్కాల్సిన ఆ జింక అప్రమత్తంగా ఉండడంతో ఊహించని ప్రమాదం తప్పింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఓ జింక నీరు తాగేందుకు సరస్సు ఒడ్డుకు చేరిన వీడియో బాగా వైరల్ అవుతోంది.బాగా దాహంగా ఉండడంతో ఓ జింక నీరు తాగడానికి చెరువు వద్దకు వస్తుంది.

అయితే ఆ చెరువులో మొసలి మాటు వేసి ఉంటుంది.నీరు తాగడానికి వచ్చిన జింకను మింగేయడానికి చాలా సైలెంట్‌గా మొసలి దానిని సమీపిస్తుంది.

అప్పటికే బాగా దాహంగా ఉన్న జింక చెరువులో నీటిని గబగబా తాగేస్తుంది.ఇంతలో ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని దానికి అర్ధం అవుతుంది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

అక్కడికి వచ్చిన మొసలి అమాంతంగా జింకపైకి దూకుతుంది.

Advertisement

అప్పటికే అప్రమత్తంగా ఉన్న జింక వెంటనే వెనక్కి దూకుతుంది.అక్కడి నుంచి చెంగు చెంగున పరుగు పెడుతూ వెళ్లిపోతుంది.ఏదో తనకు ముప్పు ఉందని భావించి, అప్రమత్తంగా ఉండడంతోనే మొసలి బారి నుంచి తప్పించుకుంటుంది.

నీళ్లలో నుంచి మొసలి బయటకు రాగానే, ఆ సమయంలో బుల్లెట్ వేగంతో జింక అక్కడి నుంచి మాయమైపోతుంది.ఇదంతా రెప్పపాటులో జరిగిపోతుంది.ఈ వీడియోను @DISASTERVIDE0 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది.

తాజా వార్తలు