సుధీర్ ను దారుణంగా అవమానించిన దీపిక.. వద్దన్నా ఇంటికి వస్తాడంటూ?

బుల్లితెర కమెడియన్ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.

సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారని బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి సుధీర్ కు భారీ ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా సుధీర్ తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.ప్రోమొలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కళ్ల జోళ్లు పెట్టుకుని ఎంట్రీ ఇస్తారు.

హైపర్ ఆది సుధీర్ కళ్లజోడు తీయగా నీది కాదు నాది తియ్యి అని చెబుతాడు.ఆ తర్వాత సుధీర్ రెండు కండువాలు వేశావని అడగగా రాత్రి వెంకటలక్ష్మి దగ్గర మరిచిపోయావట కదా అని హైపర్ ఆది చెబుతాడు.

ఆ తర్వాత నువ్వు వెంకట లక్ష్మి ఇంటికి ఎందుకు వెళ్లావని సుధీర్ హైపర్ ఆదిని అడగగా నీ కండువా తీసుకుని వద్దామని వెళ్లానని హైపర్ ఆది చెబుతాడు.

Deepika Pilli Comments About Sudigali Sudheer In Dhee Show , Comments , Jabardas
Advertisement
Deepika Pilli Comments About Sudigali Sudheer In Dhee Show , Comments , Jabardas

సుబ్బాయమ్మ ఏమంటుంది అని అడగగా మోహం పగులుద్ది అంటుందని హైపర్ ఆది చెప్పగా చలికాలం కదా మొహం పలుగుతుందనే చెప్పు అని ఆది పంచ్ వేస్తాడు.నీకు చలికాలమే అని చెప్పమని చెప్పిందంటూ ఆది కామెంట్ చేస్తాడు.ఆ తర్వాత పల్లెటూరి అమ్మాయిగా దీపికా పిల్లి, రష్మీ ఎంట్రీ ఇస్తారు.

దీపికా పిల్లి మా ఇంటికి వస్తారా అని అడగగా ప్రదీప్ మాకు ఇల్లు దొరికేసిందని చెబుతాడు.

Deepika Pilli Comments About Sudigali Sudheer In Dhee Show , Comments , Jabardas

ఎప్పుడయినా నన్ను అడిగారని మా ఇంటికి వస్తానని అని సుధీర్ దీపికా పిల్లిని అడగగా మీరు అడగకపోయినా వస్తారని దీపికా పిల్లి కామెంట్ చేశారు.వెంటనే రష్మీ అయ్యా అని అంటుంది.ఈ నెల 25వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుండగా ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు