అసలు దీపికా పదుకొనే ఆరోగ్యానికి ఏమైంది? ఏడాదిలో రెండోసారి అస్పత్రికి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

కొద్ది కొద్ది రోజులుగా దీపికా పదుకొనే ఆరోగ్యం విషయంలో పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఆ విషయాల పట్ల ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం నటి దీపికా పదుకొనే మళ్లీ తీవ్ర అస్వస్థకు గురైందట.

ఆమెకు తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ అనే ఆసుపత్రిలో చేరిందట.తీవ్ర అస్వస్థకు గురైన దీపికా పదుకొనే హాస్పిటల్ లో చేరడంతో వెంటనే వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది అని డాక్టర్లు తెలిపారు.కాగా ఇటీవలే హైదరాబాదులో ప్రభాస్ సినిమా ప్రాజెక్ట్ కె షూటింగ్ కు దీపికా పదుకొనే హాజరైన సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో వెంటనే ఆమె కామినేని ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇటీవలే దీపికకు కరోనా కూడా సోకిన విషయం తెలిసిందే.కరోనా నుంచి ఆమె కోలుకున్న తర్వాత అనంతరం ఆమె యూరోపియన్ పరిరక్షణకు కూడా వెళ్లి వచ్చింది.

తిరిగి ప్రభాస్ తో కలిసి షూటింగ్ మొదలుపెట్టింది.అయితే తాజాగా ఆమెకు అస్వస్థకు గురవ్వడానికి కారణం రక్తపోటు పై ప్రభావం చూపించడం అని నిర్మాత అశ్వని దత్ తెలిపారు.కాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే ఇందులో హాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు దీపికా పదుకొనే షారుక్ ఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement