కేన్స్ లో దీపిక పదుకొనే ధరించిన వజ్రాల హారం ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కేన్స్ 2022 ఉత్సవాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.కరోనా క్రైసిస్ తరువాత ఈ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ కేన్స్ వేడుకలు జరుగుతున్నాయి.

ఇకపోతే ఈ కేన్స్ వేదికపై భారతీయ నటీమణుల హవా ఈసారి బాగానే కనిపించింది.అయితే ఈ కేన్స్ ఉత్సవాలలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కూడా పాల్గొంది.

అయితే బరిలో ఎంతమంది ఉన్నదీపికా వచ్చింది అంటే సైడ్ ఇవ్వాల్సిందే.ఎందుకంటే ఈ కేన్స్ ఉత్సవాల్లో భాగంగా దీపికా పదుకొనే రకరకాల డిజైనర్ దుస్తులతో కేన్స్ వేదికపై ఒక మెరుపులు నడిపించింది.ఇక ఈ ఉత్సవాలలో భాగంగా తాజాగా ఈమె దాదాపుగా 3.8 కోట్ల విలువైన తెల్లని బంగారు హారాన్ని ధరించింది.ఒక దశాబ్దం తరువాత జ్యూరీ మెంబర్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఆహ్వానితురాలైన మొదటి భారతీయురాలిగా దీపిక పదుకొనే ఎంపికయింది.

ఈ కేన్స్ 2022 ఉత్సవాలలో దీపికా పదుకొనే తో పాటుగా ఎనిమిది మంది సభ్యుల జ్యూరీలో ఫ్రెంచ్ నటుడు అయిన విన్సెంట్ లిండన్ అధ్యక్షుడిగా ఉన్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ ఉత్సవాల్లో భాగంగా దీపిక ధరించిన ఆ ఆభరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

కేన్స్ ఉత్సవాల్లో దీపిక పదుకొణె అత్యంత ప్రజాదరణ పొందిన పాంథెరే డి కార్టియర్ ఆభరణాన్ని ధరించింది.

దీపికా ధరించిన ఆ ఆభరణం ధర దాదాపుగా 3.8 కోట్లు. నెక్లెస్ లో 18K తెల్ల బంగారం పచ్చ కళ్లు.ఒనిక్స్ డాట్స్ 19.05 క్యారెట్ల బ్రిలియంట్ కట్ డైమండ్ లు ఉన్నాయి.అద్భుతమైన నెక్లెస్ కార్టియర్ పాంథెర్ సేకరణ నుండి ఎంపిక చేసుకున్నది ఇది.ఇప్పుడు దీపిక మెడలోని ఖరీదైన ఆ వైట్ నెక్లెస్ సోషల్ మీడియాలో అలాగే ఆ కేన్స్ హాట్ టాపిక్ గా మారింది.దీపిక ధరించిన ఆభరణాలు చూసిన అభిమానులు నోరెళ్లబెడుతారు.

అంతేకాకుండా దీపికాకు ఆ ఆభరణం చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

చేతుల‌ను తెల్ల‌గా, మృదువుగా మార్చే వాసెలిన్‌..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు