ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజవుతున్న ఆసక్తికర సినిమాలు ఇవే!

త కొన్నేళ్లలో థియేటర్లకు ఓటీటీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.

పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం, తక్కువ ఖర్చుతో ఏడాది పాటు ఓటీటీలో సినిమా చూసే అవకాశం ఉండటంతో ఓటీటీలను సబ్స్క్రైబ్ చేసుకునే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది.

పెద్ద సినిమాల డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు భారీ మొత్తం ఆఫర్ చేస్తున్నాయి.అయితే క్రిస్మస్ కానుకగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో రిలీజవుతున్నాయి.

హీరో విశాల్ లాఠీ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.విశాల్, సునయన జంటగా నటించిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

నయనతార, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన కనెక్ట్ మూవీ కూడా ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతుండటం గమనార్హం.ఈ రెండు సినిమాలు 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

Advertisement

రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్ సినిమాలు కూడా ఈ వారమే 23వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్నాయి.ఈ రెండు సినిమాలపై భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి.బాలీవుడ్ మూవీ సర్కస్ థియేటర్లలో రిలీజ్ అవుతుండగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

ఈ ఏడాది హిట్లలో ఒకటైన మసూద ఈ నెల 21వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మలయాళంలో హిట్ గా నిలిచిన జయ జయ జయ జయహే ఈ నెల 22వ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఎమిలి ఇన్ పారిస్ వెబ్ సిరీస్, ఎలైస్ ఇన్ బోర్డర్ ల్యాండ్, గ్లాస్ ఆనియన్ నైవ్స్ అవుట్ మిస్టరీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయని సమాచారం అందుతోంది.కాఠ్ మాండు కనెక్షన్ సోనీ లివ్ లో రిలీజ్ కానుండగా బిగ్ బెట్ కొరియన్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.జీ5 ఓటీటీలో పిచర్స్ అనే హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు