లక్ అంటే ఇదే, పైసల్లేక ఇల్లు అమ్మాలనుకున్నాడు.. అంతలోనే కోటి లాటరీ తగిలింది!

జీవితంలో అదృష్టం ఎప్పుడు వస్తుందో.ఎలా వస్తుందో ఊహించడం కష్టం.

లక్ రావాలంటే లక్ ఉండాలంటారు చాలా మంది.

ఒక్కోసారి నిరాశలో కూరుకుపోయిన వ్యక్తుల్లో అదృష్టం తలుపు తడుతుంది.

అథఃపాతాళంలో ఉన్న వారిని అందలం ఎక్కిస్తుంది.అచ్చంగా అలాగే జరిగింది కేరళలోని ఓ వ్యక్తి జీవితంలో.

ఆయన ఉండేది కేరళలోని కోయ్ కోడ్ ప్రాంతం.అతని పేరు మహమ్మద్ బవ పెయింటర్ గా పనిచేస్తున్నాడు.50 ఏళ్లు ఉండే అతడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.వారిలో నలుగురు ఆడ పిల్లలు, ఒకరు అబ్బాయి.

Advertisement

ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోయాయి.మరో ఇద్దరు 12వ తరగతి చదువుతున్నారు.

పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం మహమ్మద్ చాలా అప్పులు చేశాడు.భార్య పేరుపై రూ.10 లక్షల లోన్, మరో రూ.20 లక్షల అప్పు తీసుకుని ఇల్లు కట్టాడు.దీంతో అప్పుల భారం చాలా పెరిగిపోయింది.

ఈ అప్పులు తీర్చేందుకు సరిపడా తన దగ్గర డబ్బులు లేవు.అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తీవ్రం కావడంతో రూ.40 లక్షలకు ఇల్లు అమ్మాలని అనుకున్నాడు.మరోవైపు లాటరీలు కొనడం ప్రారంభించాడు మహమ్మద్ బవ./br>ఆదివారం సాయంత్రం ఇల్లు అమ్మాలని ఫిక్స్ అయిపోయాడు.అయితే దానికి రెండు గంటల ముందు మహమ్మద్ బవకి లక్ తగిలింది.

తాను కొనుగోలు చేసిన లాటరీలో జాక్ పాట్ తగిలింది.ఏకంగా కోటి రూపాయలు వచ్చాయి.పన్నులు అన్నీ పోయాక రూ.63 లక్షలు మిగిలాయి.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement