డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయవచ్చు.. ఎలా అంటే..?

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ కలిగినవారిలో ప్రతిఒక్కరూ డెబిట్ కార్డు( Debit Card ) అనేది వాడుతున్నారు.కొంతమందికి అయితే ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉంటున్నాయి.

బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడంతో ఏటీఎంను( ATM ) వాడటంపై గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అవగాహన వచ్చింది.దీంతో రూరల్ ప్రాంతాల్లో ఉండే మహిళలు కూడా ఏటీఎంలను ఉపయోగిస్తున్నారు.

అయితే ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకోవాలంటే ఖచ్చితంగా డెబిట్ కార్డు ఉండాలి.కానీ ఇటీవల డెబిట్ కార్డు లేకపోయినా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేలా కార్డ్ లెస్ సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

Debit Cardless Atm Withdraw Money From Atm Using Yono App Details, Banking News,

తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( SBI ) డెబిట్ కార్డు లేకపోయినా డబ్బులు విత్ డ్రా చేసుకునేలా కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది.ఎస్‌బీఐ కస్టమర్లకు యోనో యాప్( Yono App ) ప్రవేశపెట్టింది.ఈ యాప్ ద్వారా డెబిట్ కార్డు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Advertisement
Debit Cardless ATM Withdraw Money From Atm Using Yono App Details, Banking News,

ఇందుకోసం మొబైల్ నెంబర్‌కు నెట్ బ్యాంకింగ్ లింక్ అయి ఉండాలి.యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత

Debit Cardless Atm Withdraw Money From Atm Using Yono App Details, Banking News,

మీ నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత ఏటీఎంకు వెళ్లిన తర్వాత యోనో క్యాష్‌ను( Yono Cash ) ఎంచుకుంటే ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.ఆ తర్వాత యొబైల్ యాప్ లో స్కాన్ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ను ఎంచుకుని ఏటీఎం స్క్రీన్‌పై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయాలి.

క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత విత్ డ్రా అమౌంట్‌ను ఎంచుకోవాలి.ఆ తర్వాత మొబైల్ కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది.

ఈ విధానం ద్వారా డెబిట్ కార్డు లేకపోయినా చాలా సులువుగా ఎస్‌బీఐ కస్టమర్లు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు