టాలీవుడ్ జోరుగా హీరోయిన్ లతో డీల్స్ ?

టాలీవుడ్ లో కొన్ని పరిస్థితులు వింతగా మారిపోతున్నాయి.కొంతమంది స్టార్ హీరోలకు వారితో ఆడి పాడే హీరోయిన్ల విషయంలో కరువు స్పష్టం కనబడుతోంది.

అయితే ఈ విషయంలో ఒక పరిష్కారం మాత్రం కనబడడం లేదు.అయితే ఇండస్ట్రీలో కొత్తగా వస్తున్న హీరోయిన్ లు అయితే తమ టాలెంట్ ను నిరూపించుకుని తర్వాత అవకాశాలను తెచ్చుకోగలుగుతున్నారు.

అయితే హీరోలకు లేదా ఎంచుకున్న కథలకు సరిపడా హీరోయిన్ లు మాత్రం దొరకడం లేదు అన్నది వాస్తవం.ఏదో దొరికిన వారితోనే.

లేదా ఇండస్ట్రీలో ఉన్న వారితోనే సర్దుకుని పోతున్నారు హీరోలు మరియు డైరెక్టర్లు.అయితే ఇతర ఇండస్ట్రీల నుండి వారానికి పది మంది వస్తున్నా వారిలో అన్ని టాలెంట్ లు ఉండడం అరుదుగా కనిపిస్తోంది.

Advertisement

తద్వారా ఒక సినిమాకు హీరోయిన్ ను ఎప్పటికప్పుడు వెతుక్కోవడం అలవాటుగా మారిపోయింది.ఒకవేళ ఒక హీరోయిన్ ఒక హీరోతో తేదీన సినిమా హిట్ అయితే.

వారిని హిట్ పెయిర్ గా గుర్తించి తదుపరి సినిమాలో కూడా అదే హీరోయిన్ ను ఆ హీరోకి సరసన నటించేలా ప్లాన్ చేస్తున్నారు.అందుకే చాలా వరకు ఈ విధమైన పద్దతికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది టాలీవుడ్.

ఆ విధంగా హిట్ పెయిర్ లేదా హిట్ కాంబో అన్న సంస్కృతి పుట్టుకు వచ్చింది.అంత ఎందుకు కొందరు దర్శకులు అయితే తమ సినిమాల్లో వరుసగా రెండు మూడు సినిమాలను కూడా ఓకే హీరో మరియు హీరోయిన్ లతో చేసిన సందర్భాలు ఉన్నాయి.

ఉదాహరణకు: ప్రభాస్ కాజల్ జంట చాలా పాపులర్ అని తెలిసిందే.వీరిద్దరూ కలిసి డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలలో నటించారు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
God Of Coins Player Safety And Responsible Gambling (UK)

రెండూ కూడా సూపర్ హిట్ అయినవే.అయితే ఆ విధంగా మంచి హిట్ శాతం ఉన్న హీరోయిన్ లకు పెద్ద పెద్ద బ్యానర్లు వారికి నచ్చిన రెమ్యునరేషన్ లు ఇచ్చి తమ సినిమాలకు లాక్ చేసుకుంటున్నారు.

Advertisement

అయితే ఈ విధమైన పద్దతికి ముందుగా శ్రీకారం చుట్టింది మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ అని తెలుస్తోంది.బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటి అయిన యశ్ రాజ్ ఫిల్మ్స్ వరుసగా మూడు సినిమాలను కూడా చేసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకునేవట.

తర్వాత ధర్మ ప్రొడక్షన్స్ లాంటివి కూడా ఇదే విధానాన్ని అనుసరించాయి.అలా ఈ సంస్కృతి మన టాలీవుడ్ ను తాకింది.

అయితే మొదటగా టాలీవుడ్ లో స్టార్ట్ చేసింది మాత్రం నిర్మాతలు డి సురేష్ బాబు, అల్లు అరవింద్ మరియు దిల్ రాజ్ లు.వీరు నిర్మించే సినిమాలలో ఒకసారి సక్సెస్ అయిన హీరోయిన్ లను తమ తదుపరి సినిమాలకు హీరోయిన్ లుగా ఒక ప్యాకేజీ మాట్లాడుకుంటున్నారు.అయితే అందరికీ ఈ అవకాశాలు వస్తాయంటే.

కాదు కేవలం అందం, ప్రతిభ రెండూ పుష్కలంగా ఉన్న వారికే ఇలాంటి ఆఫర్లు వస్తాయి.ఇలా చాలా సంవత్సరాల నుండి నడుస్తోంది.

వీరిలో నయనతార, తమన్నా లాంటి చాలా మంది తారలు ఉన్నారు.అయితే అదే విధంగా ప్రస్తుతం గీత ఆర్ట్స్ నుండి ఆఫర్ ను అందుకున్న ఒక హీరోయిన్ గురించి ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్నాయి.