వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరికి బెయిల్..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy )హత్య కేసులో నిందితుడుగా ఉండి అఫ్రూవర్ గా మారిన దస్తగిరికి( Dastagiri ) బెయిల్ మంజూరు అయింది.ఈ మేరకు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది.

సుమారు 86 రోజులుగా షేక్ దస్తగిరి కడప జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే కిడ్నాప్ కేసులో దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దస్తగిరికి కోర్టు బెయిల్ ను మంజూరు చేసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కానీ ఆయన కడప జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement