400 కోట్లతో దాసరి సినిమా!!

తెలుగు సినిమా చరిత్ర పుస్తకంగా రాస్తే అందులో లెక్కకు మించిన పేజీలు దాసరి నారాయణ రావు గురించి ఉంటాయి.

తన కంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించిన దర్శకరత్న దాసరి నారాయణ రావు ప్రస్తుతం దర్శకత్వంకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఆ మద్య ఈయన తెరకెక్కించిన ‘ఎర్రబస్సు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.దాంతో తాను ప్రస్తుత ప్రేక్షకులను అలరించలేక పోతున్నా అంటూ దర్శకత్వం చేసే ఆలోచన లేదు అంటూ తేల్చి చెప్పాడు.

అయితే ఎప్పటికైనా ఒక్క సినిమా చేయాలనేది మాత్రం తన చిరకాల వాంచ అని దాసరి చెప్పుకొచ్చాడు.మహాభారత యుద్ద నేపథ్యంలో ఒక సినిమా చేయాలనేది తన కోరిక అని, ఆ యుద్ద సమయంలో, రాత్రి వేళల్లో జరిగిన విశేషాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని, ఆ 18 రోజుల యుద్దంలో ఎన్నో జరిగాయని దాసరి అన్నాడు.

ఆ యుద్దాని వెండి తెరపైకి తీసుకు రావాలని తాను కోరుకుంటున్నాను.మహాభారత యుద్ద సంఘటనలతో నాలుగు పార్ట్‌లుగా సినిమా చేయాలని ఉంది.

Advertisement

ఒక్కో పార్ట్‌కు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌ అవుతుంది.అంతర్జాతీయ సంస్థతో కలిసి ఈ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాను.

ఆ సినిమా తీస్తే నా జీవితం సఫలం అయినట్లే అని, అంతటితో తన సినిమా ప్రస్థానంను ముగిస్తాను అని దాసరి చెప్పాడు.మరి దాసరి అన్న 400 కోట్ల సినిమా వర్కౌట్‌ అయ్యేనా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు