నిశ్చితార్థం అయ్యిందో లేదో.. తమ బంధానికి బ్రేకప్ చెప్పిన దసరా విలన్?

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో( Shine Tom Chacko ) అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ దసరా( Dasara ) విలన్ అంటే మాత్రం అందరికీ టక్కున ఈయన గుర్తుకు వస్తారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షైన్ టామ్ ఇటీవల తెలుగులో కూడా పెద్ద ఎత్తున సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

దసరా సినిమాలో విలన్ పాత్రలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో( Devara Movie ) కూడా విలన్ పాత్రలో నటిస్తున్నారు.ఇలా వరుస తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పట్ల బిజీ అయ్యారు.

Dasara Villain Shine Tom Chacko Break Up His Engagement Details, Shine Tom Chack

ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వ్యక్తిగత జీవితంలో ఇప్పటికే సింగిల్ గానే ఉన్నారు.ఇప్పటికే నాలుగు పదుల వయసులో ఉన్న షైన్ గత కొంతకాలంగా తనూజ( Thanuja ) అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ఇలా తనూజతో ప్రేమ రిలేషన్ గురించి వార్తలు రావడంతో ఈయన తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించడమే కాకుండా ఈ ఏడాది జనవరిలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం( Engagement ) కూడా జరుపుకున్నారు.

Dasara Villain Shine Tom Chacko Break Up His Engagement Details, Shine Tom Chack

ఇక త్వరలోనే ఈయన పెళ్లి తేదీని ప్రకటిస్తారని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో తమ నిశ్చితార్థం బ్రేకప్ అయిందని షాకింగ్  న్యూస్ వెల్లడించారు.ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నానని ఈయన తెలిపారు.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా తన నిశ్చితార్థపు ఫోటోలు అలాగే తనూజతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను కూడా డిలీట్ చేశారు.

Advertisement
Dasara Villain Shine Tom Chacko Break Up His Engagement Details, Shine Tom Chack

ఇలా తమ బ్రేకప్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.ఆమెతో నా బంధం కలుషితంగా మారింది.మా ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయాము.

ప్రస్తుతానికి నేను మళ్లీ డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టాను.నచ్చిన యువతి కోసం వెతుకుతున్నాను.

నాకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయని ఈయన తన బ్రేకప్ గురించి చెబుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు