ఈ పుణ్యక్షేత్రంలో మొదలైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గమ్మ దేవాలయం( Kanakadurgamma Temple )లో ఆదివారం రోజు నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు మొదలయ్యాయి.ఈ నెల 23 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

9 రోజులపాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇస్తారు.ఆదివారం రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి( Sri Bala Tripura Sundari Devi ) అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం అలంకరణ నిర్వహించనున్నారు.ప్రత్యేక పూజల తర్వాత ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 23వ తేదీ వరకు అమ్మవారి అలంకారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంకా చెప్పాలంటే అక్టోబర్ 16వ తేదీన శ్రీ గాయత్రీ దేవి ( Shri Gayatri Devi )అలంకారంలో, అక్టోబర్ 17వ తేదీన అన్నపూర్ణాదేవి( Annapurna Devi ) అలంకారంలో, అక్టోబర్ 18 వ తేదీన శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో, అక్టోబర్ 19వ తేదీన శ్రీ చామంతి దేవి అలంకారంలో, అక్టోబర్ 20వ తేదీన మూల నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంలో, అక్టోబర్ 21వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో, అక్టోబర్ 22వ తేదీన శ్రీ దుర్గా దేవి ( Shri Durga Devi )అలంకారంలో, అక్టోబర్ 23వ తేదీన విజయదశమి రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

Advertisement

ఉదయం శ్రీ మహిషాసుర మర్దిని దేవి( Sri Mahishasura Mardini Devi )గా దర్శనమివ్వనున్న అమ్మవారు, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు.అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తేప్పోత్సవం జరగనుంది.దసరా ఉత్సవాలలో 8 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

వినాయకుడి దేవాలయం నుంచి దుర్గమ్మ సన్నిధి వరకు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు.భక్తుల( Devotees ) రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేయనున్నారు.5000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవాలయ అధికారులు వెల్లడించారు.అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యూ లైన్లు మనిటరింగ్ చేయనున్నాయి.

Advertisement

తాజా వార్తలు