తేనె ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా తీసుకుంటే మాత్రం చాలా డేంజ‌ర్‌!

తేనె( Honey ).దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

తేనె మధురమైన రుచితో పాటు బోలెడు పోషకాలు, అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.

ఆరోగ్యపరంగా తేనె అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.

చర్మ సౌందర్యానికి కూడా తేనె సహాయపడుతుంది.నిత్యం ఒక స్పూను తేనె తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పుండ్లు త్వరగా త‌గ్గుముఖం పడతాయి.తేనెలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ మన రోగ‌ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

Dangerous Side Effects Of Using Honey Like This, Honey, Honey Health Benefits,
Advertisement
Dangerous Side Effects Of Using Honey Like This!, Honey, Honey Health Benefits,

తేనె లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి బయటపడడానికి గ్రేట్ గా సహాయపడతాయి.అంతేకాదు తేనె జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.బ్రెయిన్ హెల్త్( Brain Health ) ను ఇంప్రూవ్ చేస్తుంది.

వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది.ఇలా చెప్పుకుంటూ పోతే తేనె తో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అయితే ఎంత మేలు చేసినప్పటికీ తేనె విషయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు.రోజు ఉదయం వేడి నీటిలో తేనె కలుపుకుని తీసుకుంటూ ఉంటారు.

ఈ అలవాటు మనలో చాలా మందికి ఉంది.కానీ వేడి వేడి నీటిలో తేనె( Hot Water Honey ) కలపడం వల్ల అది విషం గా మారుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

ఇది స్లో పాయిజన్ లాగా అవుతుందని అంటున్నారు.బాగా వేడి ఉన్న వాటర్ లో తేనె కలిపి తాగితే కఫం ఎక్కువై అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

Dangerous Side Effects Of Using Honey Like This, Honey, Honey Health Benefits,
Advertisement

అందువ‌ల్ల‌ తేనెను ఎప్పుడూ గోరువెచ్చగా ఉన్న నీటిలోనే కలుపుకుని తీసుకోవాలని సూచిస్తున్నారు.అలాగే తేనెను వేడి చేయరాదు.వంట‌ల్లో కూడా వాడ‌కూడ‌దు.

ఇలా చేస్తే అది విషపూరితం అవుతుంది.దాంతో ఫుడ్ పాయిజన్( Food Poison ) అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇక ఆరోగ్యానికి మంచిది కాదా అని కొంద‌రు తేనెను అధిక మొత్తంలో తీసుకుంటూ ఉంటారు.ఇలా చేస్తే గుర‌క స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఆస్త‌మా ల‌క్ష‌ణాలు రెట్టింపు అవుతాయి.అధికంగా చెమ‌ట ప‌ట్ట‌డం, త‌ల తిర‌గ‌డం వంటివి కూడా జ‌రుగుతాయి.

కాబ‌ట్టి, రోజుకు ఒక‌టి లేదా రెండు స్పూన్ల‌కు మించి తేనెను వాడ‌కండి.

తాజా వార్తలు