కూల్ డ్రింక్స్ తాగుతున్నారా.. అయితే ఈ తిప్ప‌లు త‌ప్ప‌వు!

పిల్ల‌ల నుంచి పెద్దల‌ వ‌ర‌కు ఎంతో ఇష్టంగా కూల్ డ్రింక్స్ ను తాగుతుంటారు.ఇంటికి ఎవ‌రైనా అతిథులు వ‌చ్చినా.

ఎండ‌గా ఉన్నా.ఏదైనా పార్టీ చేసుకున్నా.

మొట్ట మొద‌ట కూల్ డ్రింక్సే గుర్తుకు వ‌స్తాయి.పిల్లలు కూడా వీటినే ఇష్టంగా తాగుతుంటారు.

కూల్ కూల్‌గా ఉండే కూల్ డ్రింక్స్ తాగుతుంటే ఆ మ‌జానే వేరు.అయితే కూల్ డ్రింక్స్ తాగుతున్నారు స‌రే.

Advertisement

మ‌రి వాటి వల్ల వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్యలు ఏంటో తెలుసా?.ఒక వేళ తెలియ‌క‌పోతో ఇటు ఓ లుక్కేసేయండి.

కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఎదుర్కొనే స‌మ‌స్య‌ల్లో అధిక బ‌రువు ఒక‌టి.నిజానికి కూల్ డ్రింక్స్‌లో ప్రధానంగా షుగ‌ర్ మ‌రియు గ్యాస్ ఉంటుంది.

అయితే కూల్ డ్రింక్స్ తాగిన‌ప్పుడు అందులో ఉండే షుగ‌ర్ కంటెంట్‌.మ‌న శ‌రీరంలో కొవ్వుగా మారి బ‌రువును అమాంతం పెంచేస్తుంది.

అలాగే కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల అందులో ఉండే కెఫిన్​.శరీరంలో డోపమైన్​ అనే కెమికల్​ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
పుష్ప 2 పాటకి లేడీ ప్రొఫెసర్ మాస్ స్టెప్పులు.. చూస్తుంటే వచ్చుండాయ్ పీలింగ్స్!

ఈ కెమిక‌ల్‌ వల్ల రక్తపోటు పెరుగుతుంది.మ‌రియు గుండె ప‌నితీరు మంద‌గించి.

Advertisement

హార్ట్ ఎటాక్ లేదా ఇత‌ర స‌మ‌స్య‌లను తెచ్చి పెడుతుంది.కూల్ డ్రింక్స్ అతిగా తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య మ‌ధుమేహం.

కూల్ డ్రింక్స్‌లో ఉండే అధిక క్యాల‌రీలు మ‌రియు షుగ‌ర్ కంటెంట్ శ‌రీంలో చేరి డ‌యాబెటిస్‌కు దారితీస్తుంది.అలాగే ఫాస్పరిక్ ఆసిడ్ ఉండే కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల‌ కాల్షియం పూర్తిగా త‌గ్గిపోతుంది.

త‌ద్వారా ఎముకులు తీవ్రంగా బ‌ల‌హీనప‌డిపోతాయి.‌ ఇక ప్రెగ్నెంట్‌గా ఉన్న మ‌హిళ‌లు కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండ‌డం చాలా మంచిది.

ఎందుకంటే.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల‌.

మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.అదేవిధంగా, కూల్ డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌లు రెట్టింపు అవుతాయి.

మ‌రియు జీర్ణ శ‌క్తి త‌గ్గిపోతుంది.కాబ‌ట్టి, కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే.

ఆరోగ్యానికి అంత మంచిది.

తాజా వార్తలు