బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తప్పదా ? రేపు కాంగ్రెస్ లోకి  ఆరుగురు ఎమ్మెల్యేలు 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దగ్గర నుంచి బీ ఆర్ ఎస్ పార్టీకి( BRS ) వరుస కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.

  పార్టీకి చెందిన కీలక నాయకులు,  ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బిజెపి లలో చేరిపోతుండడం ఆందోళన కలిగిస్తూనే ఉంది.

ఎంతమంది పార్టీని వీడినా తమకు నష్టం లేదని ధీమాగా బీఆర్ఎస్ అగ్ర నేతలు ప్రకటిస్తున్నా,  లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే పార్టీ నుంచి ఎవరూ వలస వెళ్లకుండా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  అయినా కాంగ్రెస్ లోకి( Congress ) బీ ఆర్ ఎస్ నాయకులు,  ఎమ్మెల్యేలు,  ఇతర కీలక నాయకుల చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది.తాజాగా బీఆర్ఎస్ మాజీ నేత , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్( Danam Nagendar ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరో 15 రోజుల్లో బీఆర్ఎస్ ఎల్పి( BRS-LP ) విలీనం తధ్యం అంటూ నాగేందర్ వ్యాఖ్యానించారు .మరో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరుతారని, బీఆర్ఎస్ లో నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ మిగలరని నాగేందర్ అన్నారు.  ఆత్మగౌరవం కోరుకునే వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీలో ఉండరని , కేటీఆర్( KTR ) ఫ్రెండ్స్ కథలన్నీ కూడా బయట పెడతానని నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

 గుండు శ్రీధర్,  సత్యం రామలింగరాజు కొడుకు వేలకోట్లు సంపాదించారని, వాటన్నిటి వివరాలు త్వరలోనే బయటపెడతానని నాగేందర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ లోపు బీఆర్ఎస్ ఎల్ఫీ కాంగ్రెస్ లో విలీనం కానుందని దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు,  సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది .ఈ సమయంలోనే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.రేపు పార్టీ మారబోయే బీఆర్ఎస్ కు చెందిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరి అనే దానిపైనే అందరికీ ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు